సంతకం పెడతా.. కానీ రేపు మీ ఇంటికి వస్తా..

-

ఓ మహిళ అవసరాన్ని అవకాశంగా తీసుకున్నాడో పై అధికారి.. ఆమెకు కావాల్సిన సంతకం పెడుతానన్నాడు.. కానీ.. ఓసారి మీ ఇంటికి వస్తా.. నా కోరిక తీర్చు అనడంతో ఖంగుతిన్న మహిళ కొండంత బాధతో పై అధికారులకు ఫిర్యాదు చేసింది. ఈ ఘటన మెదక్​ జిల్లాలో మార్చి 30న జరుగగా.. తాజాగా వెలుగులోకి వచ్చింది. ‘పని, బిల్లులిచ్చే విషయంలో నిన్ను ఏడాదికాలంగా ఇబ్బంది పెట్టాను. అదంతా మరిచిపో. నిన్ను ఉద్యోగంలో కొనసాగించే దస్త్రం మీద సంతకం చేస్తా. నువ్వు చేయాల్సిందల్లా నా కోరిక తీర్చడమే. అలా చేస్తే నీకు ఏ కష్టం రాకుండా మహరాణిలా చూసుకుంటా. ఉద్యోగ విధులూ పెద్దగా లేకుండా చూస్తా’ అంటూ అధికారి అన్నట్లు బాధిత మహిళ ఫిర్యాదు చేసింది.

What You Should Know About Sexual Harassment In The Workplace | Mint

‘నేను ఒప్పంద పద్ధతిన సంక్షేమశాఖలో పనిచేస్తున్నా. మమ్ముల్ని కొనసాగించేలా ఏడాదికోసారి జిల్లా స్థాయిలో అధికారులు ఆమోదం తెలుపుతూ సంతకాలు చేయాలి. వాటిని పరిశీలించి ఉన్నతాధికారులు మమ్ముల్ని కొనసాగిస్తారు. ఇదే విషయమై దస్త్రం మీద సంతకం చేయాలని విజ్ఞప్తి చేసేందుకు మరో మహిళా ఉద్యోగితో కలిసి మార్చి 30న కార్యాలయానికి వెళ్లా. అక్కడికి వెళ్లాక… నాతో మాట్లాడుతానని చెప్పి నా సహోద్యోగిని ఆ అధికారి పంపించేశారు. డబ్బు అడుగుతారేమో అనుకున్నా. కానీ ఆయన నోటి నుంచి నేను ఊహించని మాటలు వచ్చాయి. సంతకం పెడతానని, కానీ రేపు ఉదయం ఒకసారి మీ ఇంటికి వస్తా. నా కోరిక తీర్చు అని మాట్లాడాడు. ఒక్కసారిగా నాకేం చేయాలో అర్థం కాలేదు. సర్‌.. మీరు నా తండ్రిలాంటి వారు.. అలా మాట్లాడొద్దు అని బతిమిలాడా. అయినా ఆఫీసుల్లో ఇలాంటివన్నీ మామూలు విషయాలే.. ఇలా ఉంటేనే అన్ని పనులూ జరుగుతాయి.. నువ్వేం కంగారుపడకు అంటూ పదే పదే అలాంటి మాటలతో నన్ను వేధించాడు. ఉన్నతాధికారులు న్యాయం చేయకపోతే ఎంతవరకైనా పోరాడతా’ అని బాధిత మహిళ వెల్లడించింది.

Read more RELATED
Recommended to you

Latest news