కంపెనీలో ఒకేసారి కిందపడిన మహిళలు..కారణం ఏంటంటే?

-

ఈ మధ్య సోషల్ మీడియాలో వింత వార్తలను కూడా చూస్తున్నాము..వాటిని చూస్తే ఎవరికైనా ఏమిటి?ఎందుకు?ఎలా అనే సందెహాలు కలగడం సహజం..ఇప్పుడు అలాంటి వార్త ఒకటి నెట్టింట చక్కర్లు కోడుతుంది..ఓ ప్రముఖ కంపెనీలోని మహిళలు ఒకేసారి అందరు కుప్పకూలి పోయారు..ఇందుకు కారణం కూడా లేకపోలేదు..అదే ఇప్పుడు అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది..ఈ విషయం గురించి పూర్తి విషయాలను ఒకసారి తెలుసుకుందాం…

గ్రేటర్ నోయిడాలోని ఎకోటెక్ 3 పోలీస్ స్టేషన్ పరిధిలో షాకింగ్ ఇన్సిడెంట్ వెలుగుచూసింది. ఎలక్ట్రానిక్ విడిభాగాల తయారీ కంపెనీకి చెందిన 16 మంది మహిళా ఉద్యోగులు ఒక్కసారిగా స్పృహ తప్పి పడిపోయారు.. అందుకు కారణం దోమల మందు..దానికి దోమలు పడిపోవాలి కానీ, మనుషులు పడి పోవడం ఏంటి ? అనే సందేహం రావడం సహజం. కంపెనీలో దోమలను నిర్మూలించేందుకు పిచికారీ చేసిన దోమల మందు డోస్ ఎక్కువవ్వడం తో వీరంతా స్పృహ తప్పారు. దీంతో కంపెనీ ఆవరణలో గందరగోళ పరిస్థితి నెలకొంది.
ఆదివారం ఇది జరిగింది. దీంతో వెంటనే అలర్టైన మిగిలిన ఉద్యోగులు వారిని సమీపంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండడంతో ఐసీయూలో ఉంచి చికిత్స అందిస్తున్నారు..

కాగా, ఆసుపత్రి వద్దకు చేరుకున్న మహిళల బంధువులు కంపెనీ యాజమాన్యంపై భగ్గుమన్నారు. ఆ మాత్రం సోయి లేకుండా ప్రాణాలతో చెలగాటమాడుతారా అంటూ మండిపడుతున్నారు. అయ్యారు. బాధిత మహిళల కుటుంబసభ్యుల ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామని పోలీసులు చెబుతున్నారు. దోమల పోవడం తర్వాత ఇలాంటి పనులు చేసేప్పుడు ముందు మనుషుల ప్రాణాల మీదకు రాకుండా కొన్ని జాగ్రత్తలు కూడా తీసుకోవాలని బాధితుల బంధువులు సూచిస్తున్నారు..ఏది ఏమైనా కూడా ఈ వార్త మాత్రం సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది.. ఇలాంటి వాటిని చేసేముందు ఒకటికి పదిసార్లు ఆలోచించాలని పలువురు చెబుతున్నారు..

Read more RELATED
Recommended to you

Latest news