Womens World Cup : చేతులెత్తేసిన భార‌త బ్యాట‌ర్లు 134 ఆలౌట్.. ఇంగ్లాండ్ టార్గెట్ 135

-

ఐసీసీ మ‌హిళ ప్ర‌పంచ క‌ప్ లో భాగంగా నేడు టీమిండియా.. డిఫెండింగ్ ఛాంపియ‌న్ ఇంగ్లాండ్ తో త‌ల‌ప‌డింది. టాస్ ఓడి మొద‌ట బ్యాటింగ్ చేస‌న టీమిండియా.. ఇంగ్లాండ్ బౌల‌ర్ల దాటికి చేతులెత్తేశారు. బ్యాటింగ్ ప్రారంభించిన మొద‌ట్లోనే టీమిండియాకు ఇంగ్లాండ్ బౌల‌ర్లు దెబ్బ‌తీశారు. నాలుగో ఓవ‌ర్లోనే యంస్తిక భాటియా (8) అవుట్ అయింది. అనంత‌రం వ‌రుస‌గా భార‌త బ్యాట‌ర్లు.. పేవిలియ‌న్ బాట ప‌ట్టారు.

స్మృతి మంధ‌న్న (35), రిచా ఘోష్ (33), ఝూల‌న్ గోస్వామి (20) మిన‌హా మిగితా బ్యాట‌ర్లు.. సింగిల్ డిజిట్ స్కోర్ కే ప‌రిమితం అయ్యారు. కాగ ఇంగ్లాండ్ బౌల‌ర్లు.. చార్లీ డీన్ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టి భార‌తను కుప్ప‌కూల్చింది. అన్య షబ్ సోల్ 2, సోఫీ ఎక్లెస్టోన్, కేట్ క్రాస్ త‌లో ఒక వికెట్ ప‌డ‌గొట్టారు. దీంతో భార‌త మ‌హిళ బ్యాట‌ర్లు.. కేవ‌లం 36.2 ఓవ‌ర్లు మాత్ర‌మే ఆడ‌గ‌లిగారు. కాగ ఇంగ్లాండ్ టార్గెట్ 135 గా ఉంది. కాగ ప్ర‌పంచ క‌ప్ పాయింట్ల ప‌ట్టిక‌లో ఇంగ్లాండ్ ఆడిన మూడు మ్యాచ్ లు ఆడి.. అట్ట‌డుగునా ఉంది. కాగ భార‌త్ 2 మ్యాచ్ ల‌లో గెలిచి మూడో స్థానంలో ఉంది.

Read more RELATED
Recommended to you

Latest news