మంత్రి కేటీఆర్‌కు ప్రపంచ ఆర్థిక వేదిక ఆహ్వానం

ప్రపంచ ఆర్థిక వేదిక నుంచి తెలంగాణ రాష్ట్ర ఐటీ, పరిశ్రమల శాఖల మంత్రి కేటీఆర్‌కు ఆహ్వానం అందింది. సెర్బియాలో అక్టోబర్ 20న నిర్వహించే బయోటెక్ ఫ్యూచర్ ఫోరం సదస్సుకు హాజరు కావాలని ఆహ్వానంలో పేర్కొన్నారు. ఈ మేరకు కేటీఆర్‌కు సెర్బియా ప్రభుత్వం, ప్రపంచ ఆర్థిక వేదిక ఆహ్వానాన్ని పంపింది.

KT Rama Rao may step into K Chandrasekhar Rao's shoes

హెల్త్ కేర్, లైఫ్‌ సైన్సెస్‌ హబ్‌గా హైదరాబాద్‌ను కేటీఆర్ తీర్చిదిద్దుతున్నారని వారు లేఖలో ప్రశంసించారు. తెలంగాణ విధానాలు, అనుభవాలు సదస్సులో వివరించాలని కోరారు. బయోటెక్ ఫ్యూచర్ ఫోరం సదస్సుకు తనను ఆహ్వానించిన సెర్బియా ప్రధాని, ప్రపంచ ఆర్థిక వేదిక అధ్యక్షుడికి కేటీఆర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు.