World Nature conservation Day: పర్యావరణ పరిరక్షణ కోసం ఈ ప్రమాణాలు చెద్దామా..!!

-

రాను రాను అడవులు కనుమరుగవుతున్నాయి..ఉన్న అడవులను నరికి సిటీగా మారుస్తున్నారు.. దాంతో వాతావరణ, భూ కాలుష్యాలు ఎక్కువ అవుతున్నాయి.. మనిషి తెలిసి కొంత తెలియక కొంత చేస్తున్న తప్పు ఏదైనా ఉందంటే ప్రకృతిని కాలుష్యం చేయడం. ప్రకృతి కాలుష్యం అవడం వల్ల మనిషి చుట్టూ ఎన్నో సమస్యలు ఏర్పడుతున్నాయి. ప్రతి సంవత్సరం జులై 28 వ తేదీన ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవాన్ని జరుపుకుంటారు.

 

ఈ ప్రపంచ ప్రకృతి పరిరక్షణ దినోత్సవ సందర్భంగా ప్రపంచమంతటా ఏర్పడుతున్న కాలుష్యం, ప్రకృతి విషయంలో మనుషులు చేస్తున్న తప్పులు, ప్రకృతిని కాపాడుకునే మార్గాలు. ప్రణాళికలు వంటివి చర్చించడం, నిర్ణయాలు తీసుకోవడం జరుగుతుంది.ప్రపంచవ్యాప్త దేశాలు అన్నీ తీసుకునే ఈ నిర్ణయాల గురించి పక్కన పెడితే ఈ ప్రపంచం మీద అధిపత్యం చూపిస్తున్న మనుషులమైన మనం ప్రకృతి పరిరక్షణ కోసం ఏవిధమైన జాగ్రత్తలు తీసుకోవచ్చు..మనకు చేత నైనంత వరకు ఎలా కాపాడుకోవాలి,ప్రపంచ పర్యవరణ, ప్రకృతి సంరక్షకులు అందరికీ సూచిస్తున్న, అందరూ చేయగలిగిన కొన్ని పనులు తెలుసుకోవాల్సిందే..మనవంతు కృషిగా కొన్ని ప్రమాణాలు ఏంటో చుద్దాము..

నీటిని వృధా చెయ్యకూడదు..

అందరికీ నీరు ఎంతో అవసరం. విద్యుత్ లేకపోతే పక్షులు, జంతువులు ఎంచక్కా బ్రతికేస్తాయి కానీ నీరు మాత్రం అన్ని జీవులకు కావాలి. ఇంట్లో కుళాయి తిప్పితే వచ్చేస్తున్న నీళ్ల గురించి చాలామందికి భయమే ఉండదు. పైగా ఇళ్లలో ఫిల్టర్ అయిన నీళ్లను వదులుతారు. అలాంటి నీళ్లు ఎంతో విలువైనవి. మనఇంట్లో మన ట్యాంక్ లో నీళ్లున్నాయని దానికి మనం డబ్బు కడతామని ఇష్టమొచ్చినట్టు వృధాచేయకూడదు. ఇల్లు తుడుచుకోవడం, బట్టలు ఉతకడం, వంట పాత్రలు కడగడం ఇలా వీటికోసం వాడే నీటిని పెరట్లో చెట్లకు మళ్లించాలి.

ప్లాస్టిక్ నిషేధం..

పర్యావరణం గురించి ఆలోచించే అందరూ మొదట చెప్పేమాట ప్లాస్టిక్ వాడకం ఆపేయాలని. నిజానికి సాధారణ ప్రజలకు కూడా ఎంతో సరసమైన ధరలో అందుబాటులో ఉండటం వల్ల ప్లాస్టిక్ వినియోగం ఎక్కువగానే ఉంది. ఈ ప్లాస్టిక్ ను తిరిగి పునర్వినియోగించే అవకాశాలు ఉన్నా అది పర్యావరణానికి నష్టం చేసేదే. దీన్ని కరిగిస్తే వాయుకాలుష్యం జరుగుతుంది. పోనీ భూమిలో కలిసిపోతుందా అంటే అదీ లేదు. అందుకే మనిషి తన జీవనశైలిలో ప్లాస్టిక్ ను వాడటం ఆపెయ్యాలి. బదులుగా క్లాత్ బ్యాగ్ లు, పేపర్ బ్యాగ్ లు వాడటం మొదలుపెట్టాలి.

విద్యుత్ ఆదా చెయ్యాలి..

విద్యుత్ ఉత్పత్తి నీటి ద్వారా, గాలి ద్వారా ఉత్పత్తి అవుతుంది. దీనికోసం ఎంతో యంత్రాంగం అవసరం అవుతుంది. విద్యుత్ కోసం పక్కరాష్ట్రాల నుండి అప్పు తీసుకునే స్థితికి ఎన్నో రాష్ట్రాలు దిగజరిపోయాయి. విద్యుత్ ను ఆదా చేయడం మొదలుపెడితే ఖర్చు తిరుగుతుంది, దాని వృధా అరికట్టినవాళ్ళం అవుతాము. అవసరం లేని సమయంలో ఇంట్లో లైట్లు, ఫ్యాన్లు స్విచ్ ఆఫ్ చేయాలి. ఇంటి పనులలో వీలైనంత వరకు సొంతంగా పని చేసుకోవాలి. చీటికీ మాటికి విద్యుత్ ఆధారిత వస్తువులు కొని క్రమంగా ఇంటిపని చేయకుండా ఉంటే బద్దకం కూడా ఎక్కువైపోయి లేని పోనీ ఆరోగ్య సమస్యలు రావడం కూడా కామన్..

కొత్త వస్తువుల వాడకం తగ్గించాలి..

చాలామంది వస్తువులు పాతబడగానే కొత్తవి కొనేస్తారు. కానీ వస్తువులు చక్కగా పనిచేస్తున్నప్పుడు అలా పాతవి మార్చేయడం అవసరమా. మారుస్తున్న ఆ వస్తువుల వల్ల వాటిని తిరిగి రీసైకిల్ చేయడంలో చాలా పొల్యూట్ అయిపోతుంది. పరిశ్రమలు సెలరించే కొన్నిరకాల పాత వస్తువుల వల్ల పర్యావరణానికి ఎలాంటి నష్టం వాటిల్లుతోంది అనే విషయం ఆలోచించవు. అందుకే ప్రతిఒక్కరు ప్రకృతిని కాపాడుకోవాలి…మన తర్వాత తరాలకు మంచి చెయ్యాలని అనుకోనేవారందరి భాధ్యత ఇది..గుర్తుంచుకోండి..పర్యావరణ పరిరక్షణ మనందరి బాధ్యత.. పచ్చని చెట్లు ప్రగతికి సోపానాలు..

Read more RELATED
Recommended to you

Latest news