వామ్మో.. ప్రభాస్ కు ఈ బ్యాడ్ హ్యాబిట్ కూడా ఉందా..?

-

రెబల్ స్టార్ ప్రభాస్ గురించి ప్రత్యేకంగా పరిచయం అవసరం లేదు. పాన్ ఇండియా స్టార్ కాస్త త్వరలో గ్లోబల్ స్టార్ గా మారబోతున్నాడు. ప్రస్తుతం సలార్, ప్రాజెక్ట్ కే సినిమాలు సక్సెస్ అయితే మాత్రం ప్రభాస్ క్రేజ్ ను ఆపడం, ఆయనను తట్టుకోవడం ఎవరికీ తరం కాదని చెప్పడంలో అతిశయోక్తి లేదు. ప్రస్తుతం సైలెంట్ గా ఉన్న ఆయన విస్పోటనం చేసేందుకు రెడీ అవుతున్నాడు. ఎప్పుడూ ఏ టీవీ షోలో కూడా పాల్గొనని ఈయన .. తాజాగా బాలకృష్ణ హోస్ట్ గా చేస్తున్న అన్ స్టాపబుల్ సీజన్ 2 షో లో పాల్గొని సందడి చేసిన విషయం తెలిసిందే. ఆయన పాల్గొన్న ఎపిసోడ్ ను రెండు భాగాలుగా ఆహా నిర్వాహకులు విడుదల చేశారు.

ముఖ్యంగా శుక్రవారం రెండో పార్ట్ రిలీజ్ అవ్వగా ఇందులో ఆసక్తికరమైన విషయాలు రోజుకొకటి చొప్పున వైరల్ అవుతూ ఉండడం గమనార్హం. ప్రభాస్ లైఫ్ లో అమ్మాయి మ్యాటర్ , ఆయన వ్యాపారవేత్త కావాలనుకునే డ్రీంతో పాటు మరెన్నో విషయాలు బయటకు వచ్చాయి. ఈ క్రమంలోనే రెండవ భాగంలో ఆయన ప్రాణ స్నేహితుడు గోపీచంద్ కూడా హాజరయ్యారు. ఎపిసోడ్లో భాగంగా ప్రభాస్ కి చిరాకు వేస్తే.. కోపం వస్తే ఏం చేస్తాడనే ప్రశ్న బాలకృష్ణ నుంచి ఎదురవగా.. దీనికి గోపీచంద్ షాక్ ఇచ్చే ఆన్సర్ చెబుతూ అతిపెద్ద సీక్రెట్ బయటపెట్టారు.

గోపీచంద్ మాట్లాడుతూ.. ” ప్రభాస్ కి చిరాకు వేస్తే అందరినీ వెళ్లిపోండి అని చెబుతాడు.. అందరికీ దూరంగా.. ఒంటరిగా కూర్చుని స్మోక్ చేస్తాడు..” అంటూ తెలిపాడు. అయితే స్మోక్ చేస్తాడు అన్న విషయాన్ని గోపీచంద్ సైగలతో చెప్పడం విశేషం. అయితే ఇది చూసిన ప్రభాస్ నవ్వులు పూయించారు. ప్రస్తుతం ఈ వీడియో క్లిప్ కూడా సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. మొత్తానికి అయితే ప్రభాస్ ధూమపానం చేస్తాడని తెలిసి అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version