జియోమీ, ఒప్పో మొబైల్ ఉత్పత్తిదారులకు ఆదాయపు పన్ను షాక్ ఇచ్చింది. చట్టా వ్యతిరేకంగా వ్యవహరించనందుకు ఆ రెండు మొబైల్ కంపెనీలకు రూ.1000 కోట్ల జరిమానా విధించే అవకాశం ఉన్నది. గతవారం దేశవ్యాప్తంగా జియోమీ, ఒప్పో మొబైల్ కంపెనీల్లో తనిఖీ తర్వాత ఆదాయపు పన్నుశాఖ ఈ మేరకు నిర్ణయానికి వచ్చినట్లు సమాచారం.
డిసెంబర్ 11 నుంచి దేశవ్యాప్తంగా 11 రాష్ట్రాల్లోని జియోమీ, ఒప్పో కార్యాలయాల్లో తనిఖీలు జరిగాయి. కర్ణాటక, తమిళనాడు, అసోం, పశ్చిమబెంగాల్, ఆంధ్రప్రదేశ్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్ర, బిహార్, రాజస్తాన్ రాష్ట్రాలలో తనిఖీలు జరిగాయి.
రెండు ప్రధాన కంపెనీలు రాయల్టీ రూపంలో గ్రూప్ కంపెనీలకు రూ.5,500కోట్ల కంటే ఎక్కువ మొత్తంలో చెల్లింపులు చేసినట్లు ఆదాయపు పన్నుశాఖ తనిఖీల్లో వెల్లడైంది.