మార్చి నెలలో యాదాద్రి ఆలయ స్వామివారి హుండీ ఆదాయం….ఎంతో తెలుసా!

మార్చి నెల యాదగిరి గుట్ట శ్రీ లక్ష్మి నరసింహ స్వామివారి ఆలయ హుండీ ఆదాయం రూ. 48,81,789 వచ్చిందని ఆలయ అధికారులు వెల్లడించారు. శ్రీ లక్ష్మి నరసింహ స్వామివారిని దర్శించుకునేందుకు వివిధ ప్రాంతాల నుంచి వస్తున్న భక్తుల సంఖ్య నానాటికి పెరుగుతుంది. దీంతో ఆలయ ఆదాయం కూడా పెరుగుతుంది. మార్చి నెలలో స్వామివారి హుండీకి రూ. 48,81,789 ఆదాయం వచ్చిందని ఆలయ అధికారులు పేర్కొన్నారు. ప్రధాన బుకింగ్ ద్వారా రూ. 3,05,100, కైంకర్యముల ద్వారా రూ. 5,101,సుప్రభాతం ద్వారా రూ. 4,600,పుష్కరిణీ ద్వారా రూ. 1,250,వ్రతాలు ద్వారా రూ. 2,06,400 ఆదాయం సమకూరిందని తెలిపారు.

Income | యాదాద్రీశ్వరుడి మార్చి నెల ఆదాయం రూ. 48.81 లక్షలు

ప్రచార శాఖ ద్వారా రూ. 7,000, వీఐపీల దర్శనం ద్వారా రూ. 1,12,500,యాదరుషి నిలయము ద్వారా రూ. 61,260,ప్రసాదవిక్రయం ద్వారా రూ. 10,59,900,పాతగుట్ట ద్వారా రూ. 36,660,కళ్యాణ కట్ట ద్వారా రూ. 80,000 ఆదాయం వచ్చిందన్నారు.శాశ్వత పూజలు ద్వారా 5,000,వాహన పూజల ద్వారా రూ. 23,700,కొండపైకి వాహన ప్రవేశం ద్వారా రూ. 3,50,000,సువర్ణ పుష్పార్చన ద్వారా 79,716 ,శివాలయం ద్వారా రూ. 8,600,అన్నదానం ద్వారా రూ. 12,402,బ్రేక్ దర్శనం ద్వారా రూ. 2,37,600, ఇతరముల ద్వారా రూ. 22,85,000 ఆదాయం ఆలయానికి సమకూరిందన్నారు.