భక్తులతో కిటకిటలాడుతున్న యాదగిరి

-

తెలంగాణలోని ప్రముఖ పుణ్య క్షేత్రమైన యాదగిరిగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవస్థానం భక్తులతో కిటకిటలాగుతోంది. కార్తీక మాసం ప్రారంభం కావడం, దానికి తోడు ఆదివారం సెలవు రోజు కావడంతో భక్తులు వేలాదిగా స్వామివారిని దర్శించుకునేందుకు ఆలయానికి విచ్చేశారు. కార్తీక దీపారాధన పూజలు, సత్యనారాయణ స్వామి వ్రతం కోసం యాదాద్రికి భక్తులు పోటెత్తారు.

దీంతో సత్యనారాయణ వ్రత మండపం భక్తుల రద్దీతో కిక్కిరిసిపోయింది. వ్రతాల అనంతరం ప్రధాన ఆలయంలో లక్ష్మీనరసింహ స్వామి దర్శనం కోసం భక్తులు బారులు తీరారు. భక్తుల రద్దీతో యాదగిరి గుట్ట కొండ పరిసరాలు రద్దీగా మారాయి. భక్తుల రద్దీని క్రమబద్దీకరించేందుకు ఈవో భాస్కర్ రావు దేవస్థానం సిబ్బందిని, పోలీస్ సిబ్బందిని సమన్వయం చేస్తూ స్వయంగా ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. భక్తుల రద్దీ మరింత పెరిగే చాన్స్ ఉందని అధికారులు అంచనా వేశారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version