కేంద్ర నిధులు, రిజర్వ్ బ్యాంక్‌ లెక్కలు బహిర్గతం చేయాలి – యనమల

-

కేంద్ర నిధులు, రిజర్వ్ బ్యాంక్‌ లెక్కలు బహిర్గతం చేయాలని ఏపీ సర్కార్ ను నిలదీశారు శాసనమండలి ప్రతి పక్షనేత యనమల. రాష్ట్రంలో వాస్తవ ఆర్థిక పరిస్థితిని మరుగుపెట్టి తప్పుడు లెక్కలతో ప్రభుత్వం తప్పుదోవ పట్టిస్తోందని.. అటు కేంద్రాన్ని, ఇటు రాష్ట్ర ప్రజలను జగన్ సర్కార్ మోసం చేస్తోందని తెలిపారు.

రాష్ట్ర రెవెన్యూ రాబడులతో సంబంధం లేకుండా విచ్చలవిడిగా అధిక వడ్డీలకు అప్పులు తెస్తూ రాజ్యాంగ ఉల్లంఘనలు పాల్పడుతోంది… రాష్ట్రంలోని పరిస్థితి చూసి పెట్టుబడులు పెట్టడానికి, అప్పులివ్వడానికి ఎవరూ ముందుకు రావడం లేదని విమర్శించారు. కేంద్రం ఇచ్చిన నిధులను ఇష్టానుసారంగా బదిలీ చేసి ప్రజా ప్రయోజనాలను రాష్ట్ర ప్రభుత్వం దెబ్బతీస్తోంది…

కేంద్ర ప్రభుత్వ ప్రాయోజిత పథకాల నిధులను రాష్ట్రప్రభుత్వం పక్కదారి పట్టిస్తోంది… 15వ ఆర్థిక సంఘం నుంచి వచ్చిన రూ. 6 వేల కోట్లు, జలజీవన్ మిషన్ కింద వచ్చిన రూ. 7 వేల కోట్లు, రూసా తదితరాలను ఏం చేశారు? అని నిలదీశారు. రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా ఇవ్వాల్సిన నిధులివ్వకపోవడంతో రైల్వే పనులు నిలిచిపోయిన విషయం వాస్తవం కాదా? రాష్ట్ర ప్రభుత్వం తీసుకొస్తున్న రుణాలు, ఉపయోగిస్తున్న నిధులపై స్పష్టత ఇవ్వాలి.కేంద్ర ప్రభుత్వం, నీతిఆయోగ్‌, రిజర్వ్ బ్యాంక్‌తో జరిపిన ఉత్తర ప్రత్యుత్తరాల వివరాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version