యశోద ఓటీటీ స్ట్రీమింగ్ ఎప్పుడు.. ఎక్కడంటే..?

-

కొత్త దర్శకుడు హరి హరీష్ దర్శకత్వంలో సమంత లేడీ ఓరియంటెడ్ చిత్రంగా వచ్చిన చిత్రం యశోద . విడుదలైన మొదటి రోజు నుంచే మంచి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతోంది. ప్రముఖ నిర్మాత శివలెంక కృష్ణ ప్రసాధ్ నిర్మించిన ఈ సినిమా థియేటర్లలో విడుదలై మంచి పాజిటివ్ టాక్ సొంతం చేసుకోవడమే కాకుండా బాక్స్ ఆఫీస్ వద్ద డీసెంట్ కలెక్షన్స్ తో దూసుకుపోతోంది. ఇందులో వరలక్ష్మి శరత్ కుమార్ , ఉన్ని ముకుందన్ కీలక పాత్రలు పోషించారు. అంతేకాదు సమంత కోసం ఏకంగా మరో నలుగురు హీరోయిన్స్ ఇందులో నటించడం విశేషం. ఇకపోతే థియేటర్లలో సందడి చేస్తున్న యశోద సినిమాకు సంబంధించి ఒక తాజా అప్డేట్ వైరల్ గా మారింది.

యశోద సినిమాకి సంబంధించి ఓటీటీ అప్డేట్ రావడంతో ఎప్పుడు? ఏ ఓటీటీ ప్లాట్ఫామ్ పైన స్ట్రీమింగ్ కాబోతోంది అంటూ రకరకాల ప్రశ్నలు సంధిస్తున్నారు నేటిజన్స్. ఈ క్రమంలోనే ప్రముఖ ఓటీటీ ప్లాట్ఫారం సంస్థ అయిన అమెజాన్ ప్రైమ్ వీడియోలో యశోద స్ట్రీమింగ్ కానున్నట్లు తెలుస్తోంది. అయితే ఎప్పుడు స్ట్రీమింగ్ కాబోతోంది అనే విషయానికి వస్తే డిసెంబర్ రెండవ వారం నుంచి ఈ మూవీ అమెజాన్ ప్రైమ్ వీడియోలో ఓటీటీ స్ట్రీమింగ్ కానున్నట్లు సమాచారం.

అయితే ఈ విషయంపై ఇంకా అధికారిక ప్రకటన రావాల్సి ఉంది. ఇదిలా ఉండగా మెడికల్ మాఫియా కాన్సెప్ట్ తో సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమాలో సమంత యాక్షన్ సన్నివేశాలు ఆకట్టుకుంటున్నాయి. అలాగే మణిశర్మ బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా ఈ చిత్రానికి ప్లస్ పాయింట్ గా నిలిచింది. మొత్తానికైతే సమంత మరోసారి లేడీ ఓరియంటెడ్ చిత్రంతో తన సత్తా చాటింది. ఏది ఏమైనా సమంత అభిమానులు ఈ సినిమాను ఓటీటీ లో చూడడానికి తెగ ఎదురుచూస్తున్నారు.

Read more RELATED
Recommended to you

Latest news

Exit mobile version