Breaking : వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల ప్రకటన..

-

వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థుల జాబితా విడుదలైంది. ఎమ్మెల్సీ అభ్యర్థుల తుది జాబితాపై ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి ఆమోద ముద్ర వేశారు. అనంతరం ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణా రెడ్డి అభ్యర్థుల పేర్లను సోమవారం మీడియా ముఖంగా ప్రకటించారు. మొత్తం 18 మంది ఎమ్మెల్సీ అభ్యర్థుల పేర్లు ఖరారయ్యాయి. అభ్యర్థుల్లో బీసీ 11, ఓసీ 4, ఎస్సీ 2, ఎస్టీ 1 ఉన్నారు. స్థానిక సంస్థల కోటాలో 9 మంది, ఎమ్మల్యే కోటాలో ఏడుగురు, గవర్నర్ కోటాలో ఇద్దరు అభ్యర్థుల పేర్లను సజ్జల వెల్లడించారు.

స్థానిక సంస్థల కోటా అభ్యర్థులు : నార్తు రామారావు (బీసీ యాదవ, ఇచ్ఛాపురం), కుడిపూడి సూర్యనారాయణ (బీసీ శెట్టిబలిజ, అమలాపురం), వెంక రవీంద్రనాథ్ (ఓసీ కాపు, తణుకు), కావూరు శ్రీనివాస్ (బీసీ శెట్టిబలిజ, పాలకొల్లు), మేరుగ మురళీధర్ (ఎస్సీ మాల, గూడూరు), సిపాయి సుబ్రహ్మణ్యం (బీసీ వెన్నెరెడ్డి, శ్రీకాళహస్తి),
పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి (ఓసీ రెడ్డి, జమ్మలమడుగు), మధుసూదన్ (బీసీ వాల్మీకిబోయ, ఆదోని), ఎస్.మంగమ్మ (బీసీ వాల్మీకబోయ, పెనుగొండ).

ఎమ్మెల్యే కోటా అభ్యర్థులు : పెన్మత్స సూర్యనారాయణరాజు (ఓసి క్షత్రియ, నెల్లిమర్ల), పోతుల సునీత (బీసీ పద్మశాలి, చీరాల), కోలా గురువులు (బీసీ వడబలిజ, విశాఖ సౌత్), బొమ్మి ఇజ్రాయిల్ (ఎస్సీ మాదిగ, అమలాపురం), జయమంగళ వెంకటరమణ (బీసీ వడ్డీ, కైకలూరు), చంద్రగిరి ఏసురత్నం (బీసీ వడ్డెర, గుంటూరు వెస్ట్),
మర్రి రాజశేఖర్ (ఓసీ కమ్మ, చిలకలూరిపేట).

గవర్నర్ కోటా అభ్యర్థులు : కుంభా రవిబాబు (ఎస్టీ ఎరుకుల, అరకు), కర్రి పద్మశ్రీ (బీసీ వాడబలిజ (మత్సకార), కాకినాడ సిటీ).

Read more RELATED
Recommended to you

Latest news