మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణి న్యాయస్థానాలపై కీలక వ్యాఖ్యలు చేసారు. న్యాయ వ్యవస్థపై వైసీపీ ప్రభుత్వానికి అపార గౌరవం ఉందని ఆమె అన్నారు. కోర్టులు రాజ్యాంగ ఉల్లంఘన జరిగినపుడే జోక్యం చేసుకోవాలన్నది మా అభిప్రాయం అని ఆమె పేర్కొన్నారు. రాజ్యాంగ ప్రకారం శాసన వ్యవస్థలో జరిగే డిబేట్ లపై కోర్టుల జోక్యానికి అవకాశం లేదని ఆమె వ్యాఖ్యలు చేసారు.
స్వర్ణా ప్యాలస్ ఘటనలో విచారణ జరపొద్దని కోర్టు చెప్పటం ప్రజలలో అనుమానాలకు తావిచ్చిందని ఆమె అన్నారు. ప్రతిపక్షానికి న్యాయస్థానాల భరోసా ఉందన్న భావన ప్రజలలో వ్యక్తమౌతుందని ఆమె విమర్శించారు. ప్రభుత్వం చేసే మంచిపనులకు న్యాయస్థానాల భరోసా ఉందన్న భావన కలిగించాలని అన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ మాకూ ఉంటుందని, న్యాయ వ్యవస్థలను విమర్శించాలన్నది మా ఉద్దేశ్యం కాదు అన్నారు.