ఆనందయ్య మందుని ఎలుకలపై ప్రయోగం…?

-

ఆనందయ్య మందు పై జంతువులతో ప్రయోగాలు చేస్తామని వైసీపీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి వ్యాఖ్యానించారు. తిరుపతి శివార్లలోని సృజన లైఫ్ ల్యాబ్ కు ప్రయోగాలకు అర్హత పై తనిఖీ చేసిన చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి… ఆ తర్వాత కీలక వ్యాఖ్యలు చేసారు. ఇక శాస్త్రవేత్తలు కూడా మీడియాతో మాట్లాడారు. ఆనందయ్య మందును ఎలుకలపై కుందేళ్ళ పై ప్రయోగం చేసి ఫలితాలు ఇస్తాము అని అన్నారు.

ఆ మందు వల్ల జంతువులకి దుష్పరిణామాలు ఏమైనా కలుగుతుందా విడతలవారీగా మందు ఇచ్చి చూస్తాము అని ప్రయోగాలు చేయడానికి 14 నుంచి 28 రోజులు సమయం పడుతుంది అని తెలిపారు. గత 15 సంవత్సరాలుగా పలు అల్లోపతి ఆయుర్వేద మందుల కి మా ల్యాబ్లో జంతువుల పై ప్రయోగాలు చేశాము అని వివరించారు. ఆనందయ్య మందు పై ప్రయోగాలు చేయడానికి మాకు అనుమతి వస్తే చేయడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు. కంటి ముందు ని కోవిడ్ సీరియస్ గా ఉన్న జంతువు పై ప్రయోగం చేయాల్సిన అవసరం ఉందన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news