8,9 తేదీల్లో వైసీపీ ప్లీనరీ.. మొదటి రోజు ఎజెండా ఇదే..!

-

వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ ఆవిర్భవించి 12సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న నేపథ్యంలో ఈ నెల 8,9 తేదీల్లో వైసీపీ ప్లీనరీ సమావేశాలు ఘనంగా నిర్వహించనున్నారు. అయితే.. ఈ నేపథ్యంలో వైఎస్ఆర్ కాంగ్రెస్‌ పార్టీ ప్లీనరీ ఎజెండా సిద్ధమైంది. మొదటి రోజు ఐదు అంశాలపై చర్చ జరగనుంది. ఉదయం 8 గంటలకు ప్లీనరీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 8 గంటల నుంచి 10 గంటల వరకూ సభ్యులు రిజిస్ట్రేషన్. 10 గంటల 10 నిమిషాలకు పార్టీ జెండాను అధ్యక్షుడు జగన్ ఆవిష్కరించనున్నారు. 10 గంటల 15 నిమిషాల నుంచి 20 నిమిషాల వరకు ప్రార్ధన. 10 గంటల 30 నిమిషాలకు దివంగత నేత వైయస్ రాజశేఖర రెడ్డి విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించడం.

Group Politics Turns Ugly For YSRCP In Nellore

అనంతరం సర్వమత ప్రార్థనలు. 10.55 నిమిషాలకు పార్టీ అధ్యక్ష ఎన్నికల ప్రకటనను సీనియర్ నేత ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు విడుదల చేయనున్నారు. అలాగే సరిగ్గా 11 గంటలకు పార్టీ అధ్యక్షుడు జగన్ ప్రారంభోపన్యాసం జరుగనుంది. పార్టీ జమాఖర్చుల ఆడిట్ నివేదిక ప్రతిపాదన, ఆమోదం. అనంతరం పార్టీ నియమావళి సవరణల ప్రతిపాదన, ఆమోదం. 11:35 నుంచి 11.45 నిమిషాల వరకు పార్టీ కార్యక్రమాలను నివేదన. ఆ తర్వాత ప్రారంభం కానున్న తీర్మానాలు. 11.45 నిమిషాలకు మొదటి తీర్మానంగా మహిళా సాధికారత దిశ చట్టం, తీర్మానంపై మంత్రులు ఉషశ్రీ చరణ్, రోజా , ఎమ్మెల్సీ పోతుల సునీత, లక్ష్మీపార్వతి, జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడనున్నారు.

రెండో అంశంగా విద్యపై తీర్మానం ఒంటిగంటకు విద్య పై తీర్మానం. ఈ అంశంపై మంత్రులు బొత్స సత్యనారాయణ, ఆదిమూలపు సురేష్, ఎమ్మెల్యేలు కిలారి రోశయ్య, సుధాకర్ బాబు, అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ మాట్లాడనున్నారు. 2 గంటల 15 నిమిషాల నుంచి ఒక పావు గంట పాటు సాంస్కృతిక కార్యక్రమాలు, మధ్యాహ్నం 2:30 గంటలకు డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్ఫర్ పై తీర్మానం. డీబీటీపై మంత్రులు పెద్దిరెడ్డి, బుగ్గన, ఎమ్మెల్యేలు కొత్తగుళ్ళి భాగ్యలక్ష్మి, చెవిరెడ్డి భాస్కర రెడ్డి మాట్లాడతారు. 3.15 గంటలకు వైద్యంపై తీర్మానం. వైద్యం అంశంపై మంత్రులు విడదల రజిని, సిదిరి అప్పలరాజు, ఎమ్మెల్యేలు అనిల్ కుమార్ యాదవ్, ఆళ్ల నాని మాట్లాడనున్నారు. సాయంత్రం 4.30గంటలకు పరిపాలనా- పారదర్శకత అంశంపై చర్చ. ఈ అంశంపై స్పీకర్ తమ్మినేని సీతారాం, మంత్రి ధర్మాన ప్రసాదరావు, ఎమ్మెల్యేలు పుష్ప శ్రీవాణి, పార్థసారథి మాట్లాడనున్నారు. సాయంత్రం 5 గంటలతో ముగియనున్న మొదటిరోజు ప్లీనరీ సమావేశం.

 

Read more RELATED
Recommended to you

Latest news