రైతే రాజు : కారు కొన్నాడు అవ‌మానం వ‌ద్ద‌నుకున్నాడు…!

-

జీవితంలో పైకి వ‌చ్చే ప‌నులు ఎన్నో చేయాలి.జీవితాన్ని అందంగా తీర్చిదిద్దుకోవ‌డం ద్వారానే మంచి ప‌నులు కొన్ని, విభిన్నత‌తో కూడిన ఆస‌క్తులు కొన్ని వెలుగులోకి వ‌స్తాయి.అవమానం ఎంతున్నా భ‌రించి దాటుకుని రావ‌డంలో సిస‌లు విజ‌యం ఉంది. ఆ రైతు అదే చేశాడు. అవమానం దాటుకుని వ‌చ్చి తానేంటో నిరూపించాడు.రైతే రాజు అని నిరూపించి త‌న స‌త్తా చాటాడు. జీవితంలో ఎన్నో అవ‌రోధాలు, చీడ పీడ‌లు ఉక్కు సంక‌ల్పంతో దాటిన ఆ రైతు ఇప్పుడొక స్ఫూర్తి.ఈ క‌థ క‌ర్ణాట‌క‌లోని తుముకూర్ మ‌హేంద్ర షోరూంలో జ‌రిగింది.

బొలెరో పికప్ ట్రక్కు .. దీని విలువ ప‌ది ల‌క్ష‌లు. తాను కొనుగోలు చేయాల‌ని అనుకున్నాడు కెంపేగౌడ అనే రైతు.అనుకున్న‌దే త‌డ‌వుగా షోరూంకు వెళ్లాడు. వివ‌రం అడిగి తెలుకుంటుంటే ఆ షాపు సిబ్బంది ఆయ‌న‌ను అవ‌మానించారు. ఇదేమ‌యినా ప‌ది రూపాయ‌ల బొమ్మ కారు అనుకున్నావా అని అవ‌మానించారు.వెంట‌నే గంట‌లో డ‌బ్బులు తీసుకువ‌చ్చి త‌న స్నేహితుల ఎదుటే త‌న‌ను అవ‌మానించిన వారికి ఆ డ‌బ్బు క‌ట్టి, గంట‌లోనే ట్రక్కు డెలివ‌రీ ఇవ్వాల‌ని ప‌ట్టుబ‌ట్టాడు. ఈ విష‌యం ఇక్క‌డితో వ‌దిలేయ‌క షో రూం సిబ్బంది అనుచిత ప్ర‌వ‌ర్త‌న‌పై పోలీసులను ఆశ్ర‌యించాడు. ఆఖ‌రికి సిబ్బంది దిగివ‌చ్చి లిఖిత పూర్వ‌క క్ష‌మాప‌ణ‌లు చెప్పారు.

జీవితంలో ఎవ్వ‌రినీ త‌క్కువ‌గా చూడకండి.ఎవ్వ‌రిలో ఏ విష‌యం దాగి ఉందో ఎవ‌రికి తెలుసు అని! దేశానికి అన్నం పెట్టే రైతు ల‌క్షాధికారి ఎందుకు కాకూడ‌దు.ఆయ‌న‌ను చూస్తే మ‌న‌కెందుకు అంత చిరాకు, కోపం. వేషం చూసి మ‌నుషుల‌ను అంచ‌నా వేసే సంస్కృతి వ‌ద్ద‌నుకుంటే మేలు

Read more RELATED
Recommended to you

Exit mobile version