శీతాకాలంలో చాలా కామన్ గా ఎదురయ్యేవి చర్మ సమస్యలు. ఇటువంటి సమస్యలు రాకుండా ఉండాలంటే కచ్చితంగా డైట్ లో ఈ ఆహార పదార్థాలు తప్పక తీసుకుంటూ ఉండాలి. వీటిని తీసుకోవడం వలన సమస్యలు దూరం అవుతాయి. మరి ఎటువంటి సమస్యలు నుండి ఎలా దూరంగా ఉండొచ్చు, ఏయే ఆహారపదార్దాలు తీసుకోవాలి అనే విషయాన్ని ఇప్పుడు తెలుసుకుందాం. మరిక వాటి కోసం చూద్దాం.
చేదుగా ఉండేవి:
శీతాకాలంలో చర్మ వ్యాధులు రాకుండా ఉండేందుకు మీరు మీ డైట్ లో మెంతికూర, ఉసిరికాయ, బెండకాయ వంటివి తీసుకుంటూ వుండండి. అలానే కాకరకాయ, బీట్‌రూట్ వంటివి కూడా తీసుకుంటూ వుండండి. అప్పుడు సమస్యే ఉండదు.
బ్రోకలీ, బ్రస్సెల్స్ స్పౌట్స్ ని డైట్ లో చేర్చుకోండి:
శీతాకాలంలో చర్మ వ్యాధులు లేకుండా ఉండేందుకు బ్రోకలీ, బ్రస్సెల్స్, సెలెరీ, కొత్తిమీర, గ్రీన్ బీన్స్, కాలే, ఓక్రా, పార్స్లీ తీసుకుంటూ వుండండి.
కీరా, ద్రాక్ష వంటివి కూడా తీసుకోండి:
శీతాకాలంలో చర్మ వ్యాధులు లేకుండా ఉండేందుకు క్యారెట్, బీట్‌రూట్, కీరా ని తీసుకుంటూ వుండండి. అలానే సిట్రస్ ఫ్రూట్ జ్యూస్‌లని తీసుకోకుండా చూసుకోండి.
ఈ ఆహారాన్ని మాత్రం అస్సలు తీసుకోవద్దు:
అసలు పుల్లటి ఆహారం తీసుకోకండి.
కారం, మసాలాలు కూడా వద్దు.
నూనె, ఫ్రై చేసిన వాటిని కూడా మీరు మీ డైట్ లో తీసుకోకండి. ఈ ఆహారాన్ని మాత్రం అస్సలు తీసుకోకండి. లేదంటే చర్మ సమస్యలు కలగొచ్చు.