మనకు ఎంత ఇష్టమైన ఆహారమైన..డైలీ తినమంటే తినలేం కదా..!కానీ ఓ అమ్మాయి.. 23 ఏళ్ల పాటు.. కేవలం సాండ్‌విచ్‌లు తింటూ బతికేసింది. తనకు రెండేళ్ల వయసున్నప్పటి నుంచి.. మొన్నటివరకూ డైలీ మూడుపూట్లా ఇవే తినేదట. ఎందుకు అలా అనే కదా మీ డౌట్.. తనకి ఇది తప్ప మిగతా ఏ ఫుడ్ పడదట. అందుకే ఇవి తినాల్సి వచ్చింది. అయితే తన జీవితంలో ఈ మధ్య ఓ మిరాకిల్ జరిగింది.. దాంతో తను సాండ్‌విచ్ తినే బాధ నుంచి బయటపడింది.!
యూకెకి చెందిన 25 ఏళ్ల జోస్ సాండ్లర్ అనే యువతి 23 ఏళ్ల పాటు కేవలం సాండ్‌విచ్‌లు తింటూ బతికేసింది. మిగత ఏ ఫుడ్ తిన్నా అనారోగ్యానికి గురవడంతో చచ్చినట్లు ఇదే జోస్ సాండర్ ఇదే తినేది.. అలాంటి తన లైఫ్‌లో ఓ మిరాకిల్ జరిగింది. డేవిడ్ కిల్మరీ అనే హిప్నటిస్ట్ జోస్ సాండ్లర్ జీవితాన్నే మార్చేశాడు. కేవలం సాండ్‌విచ్ మాత్రమే తీసుకోవడం వల్ల శరీరానికి తగినంత పోషకాలు అందక జోస్ మెదడు, నరాలకు సంబంధించిన దీర్ఘకాలిక వ్యాధుల బారినపడింది. దీంతో ఎలాగైనా సరే తన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకోవాలని జోస్ ఫిక్స్ అయింది. డేవిడ్ కిల్మరీ అనే హిప్నటిస్ట్ తన లాంటి ఎన్నో కేసులను సక్సెస్‌ఫుల్‌గా డీల్ చేశాడని తెలుసుకుని అతన్ని సంప్రదించింది.
డేవిడ్ కిల్మరీ రెండు గంటల చొప్పున కొద్దిరోజుల పాటు సాండ్లర్‌ను హిప్నటైజ్ చేసేవాడు… అంతే… జోస్ సాండ్లర్ పూర్తిగా మారిపోయింది. కేవలం సాండ్‌విచ్‌లు మాత్రమే తీసుకున్న జోస్ సాండ్లర్ ఇప్పుడు అన్ని రకాల ఫుడ్స్ తినగలుగుతుంది.. మొదటిసారి వివిధ రకాల ఫుడ్స్ తీసుకున్న తను..నేను నమ్మలేకపోతున్నా.. స్ట్రాబెరీస్ తిన్నాను ఎంత రుచిగా ఉన్నాయో… వగమమ చిల్లీ స్క్విడ్ కూడా ట్రై చేశాను… చాలా స్పైసీగా ఉంది. మున్ముందు కర్రీస్, ఇతర ఫుడ్స్‌ను ట్రై చేస్తాను అని. చాలా సంతోషంగా చెప్పింది జోస్ శాండ్లర్.
జోస్ సాండ్లర్ ఇన్నేళ్లు నియోఫోబియాతో బాధపడినట్లు హిప్నటిస్ట్ డేవిడ్ కిల్మరీ తెలిపారు. ఆ కారణంగానే ఆమె సాండ్‌విచ్ తప్ప ఇతర ఆహార పదార్థాలు కనీసం రుచి చూసేందుకు కూడా ఇష్టపడలేదని తెలిపారు. తాను హిప్నటైజ్ చేసిన కొద్దిరోజులకే ఆమెలో మార్పు కనిపించిందట. ఇప్పుడు జోస్ బట్లర్ అన్ని రకాల ఫుడ్స్ ఆస్వాదిస్తోందని తెలిపారు.
మొత్తానికి హప్నటిసం వల్ల ఆమె లైఫ్ మారిపోయింది. అయినా అన్ని సంవత్సరాలు పాపం సాండ్‌విచ్ మాత్రమే ఎలా తినిందో కదా..! నిజంగా ఇది శాపమనే చెప్పాలి. ఎంత ఇష్టమైన ఫుడ్ అయినా వరుసగా రెండు రోజులు తింటేనే మనకు బోర్ కొడుతుంది..! ఆమె 23 ఏళ్ల పాటు.. కేవలం సాండ్‌విచ్ తినిందంటే గొప్ప విషయమే..!