తెలంగాణలో మూతపడ్డ పరిశ్రమలకు దిక్కులేదు కానీ : వైఎస్‌ షర్మిల

-

ట్విట్టర్ వేదికగా ముఖ్యమంత్రి కేసీఅర్ పై వైఎస్సాఆర్‌టీపీ అధినేత్రి వైఎస్ షర్మిల ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణలో మూతపడ్డ పరిశ్రమలకు దిక్కులేదు కానీ.. దొర గారు పక్క రాష్ట్రాల్లో ఫ్యాక్టరీలను కాపాడే పనిలో పడ్డాడు అంటూ ఆమె ధ్వజమెత్తారు. ప్రైవేటీకరణ కాకుండా ఆపుతడట.. రాష్ట్ర సొమ్ముతో పెట్టుబడులు పెడతాడట అంటూ ఆమె ఎద్దేవా చేశారు. అక్కడ ఉద్యోగులను ఆదుకుంటాడట. మరి మన రాష్ట్రంలో మూతపడిన పరిశ్రమల సంగతేంది దొర? ఇక్కడ రోడ్డున పడ్డ వేలాది కార్మికుల కుటుంబాలు నీ కండ్లకు కనపడడం లేదా? అని ఆమె ప్రశ్నించారు.

Jagga Reddy cannot threaten YSR daughter: YS Sharmila

గెలిస్తే 100రోజుల్లో నిజాం షుగర్ ఫ్యాక్టరీ తెరిపిస్తానని మోసం చేశావ్. అజంజాహీ మిల్స్, పేపర్ ఫ్యాక్టరీలకు పునర్వైభవం తీసుకొస్తానని దగా చేశావ్. ఎన్నడో మూతపడిన IDPL,HMT,HCL,ఆల్విన్, ప్రాగటూల్స్ లాంటి కంపెనీలను తెరిపించడం చేతకాలేదు. ముందుగా ఇక్కడ మూత పడిన పరిశ్రమలను తెరిపించు. రోడ్డున పడ్డ కార్మికులను ఆదుకో. దమ్ముంటే కేంద్రం మెడలు వంచి బయ్యారం స్టీల్ ప్లాంట్ ను ఏర్పాటు చేయించు. కేంద్రం ఏర్పాటు చేయకుంటే రాష్ట్ర ప్రభుత్వమే ఏర్పాటు చేస్తదన్న మీ హామీని నిలబెట్టుకో. కేసీఆర్ @చేతకాని దద్దమ్మ ముఖ్యమంత్రి ” అని వైఎస్‌ షర్మిల ధ్వజమెత్తారు.

Read more RELATED
Recommended to you

Latest news