పార్టీ ఏర్పాటు చేసిన తర్వాత మొదటి సారిగా ప్రెస్ మీట్ నిర్వహించిన వైఎస్ షర్మిల సంచలన వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ ప్రభుత్వంతో పాటు ఏపీ ప్రభుత్వంపై వైఎస్ షర్మిల చాలా ఘాటుగానే స్పందించారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రాజన్న రాజ్య తీసుకురాకపోతే.. కచ్చితంగా వచ్చే ఎలక్షన్స్ లో సీఎం జగన్ మోహన్ రెడ్డికి ఓటమి తప్పదని వైఎస్ షర్మిల చురకలు అంటించారు.
ప్రస్తుతం ఏపీలో రాజన్న రాజ్యం స్థాపిస్తున్నట్లుటే కనిపిస్తుందన్నారు షర్మిల. వైఎస్సార్ చనిపోయిన తర్వాత మా గతి ఏమౌతాయి అని తెలంగాణ ప్రజలు భయపడుతున్నారని… తెలంగాణ ప్రజలను వైఎస్సార్ గుండెల్లో పెట్టుకుని చూశారన్నారు.
తమ పార్టీని అవమానిస్తే వైఎస్సార్ ను అవమానించినట్లేనని పేర్కొన్నారు. కృష్ణ, గోదావరి బోర్డుల మీటింగ్ లకు కేసీఆర్ ఎప్పుడూ సీరియస్ గా తీసుకోలేదని… కేసీఆర్ అన్ని విషయాలను పెద్దగా తీసుకోరు కాబట్టే కేంద్రం ఈ గెజిట్ విడుదల చేసిందన్నారు. కేంద్రం పెద్దన్న పాత్ర పోషించాలని.. అలా చేస్తారని భావిస్తున్నానని తెలిపారు. ఏ రివర్ అయినా… ఒక్క చుక్క నీటి బొట్టును తెలంగాణ వదులుకోదని… ఇతర రాష్ట్రాలకు చెందిన ఒక్క నీటి చుక్కను తీసుకోమని స్పష్టం చేశారు. కేంద్రం గెజిట్ పై పూర్తిగా అధ్యయనం చేసిన తర్వాతే స్పందిస్తామన్నారు షర్మిల.