వైఎస్‌ఆర్‌టీపీ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల పాదయాత్ర పునః ప్రారంభం కానుంది. రేపటి నుంచి వైఎస్ షర్మిల పాదయాత్ర పునః ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలోనే, పాదయాత్ర రూట్ మ్యాప్ పై ముఖ్య నేతలతో నేడు మధ్యాహ్నం సమావేశం కానున్నారు వైఎస్‌ఆర్‌టీపీ పార్టీ అధినేత్రి వైఎస్ షర్మిల.
వర్ధన్నపేట నియోజకవర్గంలో టిఆర్ఎస్ కార్యకర్తల దాడి, పోలీసులు అరెస్ట్ తో వైఎస్ షర్మిల పాదయాత్ర ఆగిపోయింది. ఇక కోర్టు అనుమతితో పాదయాత్రకు సిద్దమవుతున్నారు వైఎస్ షర్మిల. మహబూబాబాద్ నియోజకవర్గం నుంచి పాదయాత్ర ప్రారంభించే అవకాశం ఉన్నట్లు సమాచారం అందుతోంది. దీనిపై ఇవాళ సాయంత్రం లోగా క్లారిటీ రానుంది.
ఒకప్పుడు TRS ఉద్యమకారుల పార్టీ.. ఇప్పుడు గూండాల పార్టీ. ఒక మహిళ 3500KM పాదయాత్ర చేసి, KCR మోసాలను ఎండగడుతుంటే.. ఓర్వలేక దాడులకు పాల్పడ్డారు. పోలీసులు KCRకు తొత్తుల్లా మారారు. ఇది దొంగల రాజ్యం.. దోపిడీ రాజ్యం. KCR ఎన్ని కుట్రలు పన్నినా ప్రజాప్రస్థానం ఆగదని వైఎస్ షర్మిల తాజాగా చేసిన ట్వీట్ లో పేర్కొన్నారు.