కేసీఆర్ నీది గుండెనా బండా…?: షర్మిల

-

తెలంగాణాలో రాజకీయ పార్టీ పెట్టి సంచలనం కావాలని భావిస్తున్న వైఎస్ షర్మిల ఇప్పుడు సిఎం కేసీఆర్ ని ఎక్కువగా టార్గెట్ చేస్తున్నారు. కేసీఆర్ అనుసరిస్తున్న విధానాలను ఆమె తీవ్రంగా తప్పు బడుతున్నారు. తాజాగా మరోసారి కీలక వ్యాఖ్యలు చేసారు. కేసీఆర్.. మీది గుండెనా..బండనా.? అంటూ ఆమె ఆగ్రహం వ్యక్తం చేసారు. సెలెక్ట్ అయిన స్టాఫ్ట్ నర్సులకు తక్షణమే పోస్టింగ్ ఇవ్వండి అని సూచించారు.

658 కుటుంబాల ఉసురు పోసుకోకండి అని అన్నారు. బాధితులెవరూ అధైర్య పడొద్దు.. అండగా నేనుంటా అని హామీ ఇచ్చారు. కరోనాను ఆరోగ్యశ్రీలో చేర్చాల్సిందే అని డిమాండ్ చేసారు. పేదలు పిట్టల్లా రాలుతుంటే మీకు కనిపించడం లేదా.? అని ప్రశ్నించారు. ఆయుష్మాన్ భారత్ లో తెల్ల రేషన్ కార్డున్న వారందరు కవర్ కారు అని వైద్య,ఆరోగ్యశాఖలో ఉన్న ఖాళీలన్నింటినీ భర్తీ చేయాలి అని డిమాండ్ చేసారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version