‘సారు ఆయన కారు’..కేసీఆర్‌ కు తెలంగాణ ప్రజలే అక్కర్లేదు – షర్మిల

-

సీఎం కేసీఆర్‌ పై మరోసారి ఆగ్రహం వ్యక్తం చేశారు వైఎస్‌ షర్మిల. అభివృద్ధిలో పోటీ పడాల్సిన ‘సారు ఆయన కారు’ అప్పులు, అత్యాచారాలు,రైతుల ఆత్మహత్యలు,మానవ అక్రమ రవాణాలో పోటీ పడుతోంది. 16వేల కోట్ల మిగులు బడ్జెట్ రాష్ట్రాన్ని 8 ఏండ్లలో 4లక్షల కోట్ల అప్పులు చేసి ఎవరిని ఉద్ధరించారు దొర గారు? అని ప్రశ్నించారు.

రెండేండ్లలోనే మీరు చేసిన లక్ష కోట్ల అప్పు ఎక్కడ పోయింది? తెచ్చిన అప్పులు దొర ఖజానా దాటి బయటకు రావు. కల్వకుంట్ల కమీషన్ రావు ధనదాహం తీరదు.4లక్షల కోట్ల అప్పులతో ఏ ఇంటికైనా 4లక్షల ప్రయోజనం జరిగిందా?తెచ్చిన అప్పులతో విద్యార్థుల ఫీజు రీయింబర్స్ మెంట్ ఇచ్చారా? రైతుల రుణమాఫీ చేశారా? డబుల్ బెడ్ రూం ఇళ్లు కట్టారా? కనీసం పెన్షన్లకైనా ఇచ్చారా? అని నిలదీశారు.

బంగారు తెలగాణ పేరుతో అప్పుల తెలంగాణగా మార్చారు. ఎనిమిదేండ్లుగా కేసీఆర్ అండ్ కో కోసం చేస్తున్న అప్పులు తడిసి మోపెడై రాష్ట్ర ప్రజల నెత్తిన గుదిబండగా మారాయి.తెచ్చిన అప్పులతో పాటు పెట్టిన మొత్తం ఖర్చుపై వెంటనే శ్వేత పత్రం విడుదల చేయాలని YSR తెలంగాణ పార్టీ డిమాండ్ చేస్తోందన్నారు షర్మిల.

 

 

Read more RELATED
Recommended to you

Latest news