నిజామాబాద్ జిల్లాలో వైయస్ షర్మిల పర్యటన..

-

నిజామాబాద్ జిల్లా లో వైయస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురా లు ఇవాళ వైయస్ షర్మిల పర్యటించారు..ఈ సందర్బంగా షర్మిల మాట్లాడుతూ.. వైయస్సార్ వల్ల 2006 సంవత్సరంలో నిజామాబాద్ బిడ్డల కోసం యూనివర్సిటీ ప్రారంభమైందన్నారు. తెలంగాణ యూనివర్సిటీ సమస్యల యూనివర్సిటీ నిలయం గా మారిందని… తెలంగాణలోని అన్ని యూనివర్సిటీలకు కనీసం నిధులు ఇవ్వలేని దుస్థితి నెలకొందని తెలిపారు.

తెలంగాణ యూనివర్సిటీ వీసీ పోస్టు కోసం కేటీఆర్ కు 2 కోట్లు డబ్బులు చెల్లించినట్లు ఆరోపణ ఉందని.. కేటీఆర్ అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వ ఉద్యోగాలను 4,5శాతం మాత్రం ఇవ్వగలమని అనడం సిగ్గుచేటు ఫైర్‌ అయ్యారు. తెలంగాణ ప్రజలను సోమరిపోతులు వ్యాఖ్యానించడం కేటీఆర్ కు ఎంత వరకు సబబు అని మండిపడ్డారు. హుజరాబాద్ లో ఫీల్డ్ అసిస్టెంట్లు నామినేషన్ వేయడం చూస్తే అడ్డుకొని అరెస్ట్ చేయడం కెసిఆర్ కు అవసరమా..? అని ప్రశ్నించారు. హుజరాబాద్ లో గెలుపు కొరకు ప్రభుత్వ అధికారాన్ని దుర్వినియోగం పాల్పడుతున్న కేసీఆర్ ప్రభుత్వమని నిప్పులు చెరిగారు.

Read more RELATED
Recommended to you

Latest news