ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి YSR పేరు పెట్టడంపై వైయస్ షర్మిల కీలక వ్యాఖ్యలు

-

విజయవాడలోని ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పేరు మార్పు చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. పేరు మార్పునకు సంబంధించిన బిల్లును ఏపీ శాసనసభలో ప్రవేశపెట్టి ఆమోదించారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం అవుతున్నాయి. ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కి YSR పేరు పెట్టడం పై వైఎస్ షర్మిల కీలక వ్యాఖ్యలు చేశారు.

ఒక ప్రభుత్వం పెట్టిన పేరును.. మరో ప్రభుత్వం ఆ పేరును తొలగిస్తే అవమాన పరిచినట్లేనన్నారు. ఆ పెద్ద మనిషిని అవమానిస్తే కోట్లమంది ప్రజలను అవమాన పరిచినట్లేనని కీలక వ్యాఖ్యలు చేశారు వైయస్ షర్మిల. ఇప్పుడు వైఎస్సార్ పేరు పెడతారు… రేపు వచ్చే ప్రభుత్వం వైఎస్సార్ పేరు మారిస్తే..! అప్పుడు వైఎస్సార్ ను సైతం అవమానించినట్లే కదా అన్నారు. ఒకరి ఖ్యాతిని తీసుకొని వైఎస్సార్ గారికి ఆ ఖ్యాతి ని ఇవ్వాల్సిన అవసరం లేదన్నారు షర్మిల.YSR కి ఉన్న ఖ్యాతి ఈ ప్రపంచంలోనే ఎవరికి లేదన్నారు.

Read more RELATED
Recommended to you

Latest news