వైఎస్ వివేకా హత్య కేసులో మరో ట్విస్ట్.. వివేకా అనుచరులపై కేసు !

-

వైఎస్ వివేకా హత్య కేసులో కొత్త పరిణామం చోటు చేసుకుంది. అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప ను గంగాధర్ రెడ్డి కలిశారు. సీబీఐ, వివేకా అనుచరుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఫిర్యాదు చేశారు గంగాధర్‌. తనకు రక్షణ కల్పించాలని ఎస్పీ ని కోరిన బాధితుడు గంగాధర్ రెడ్డి… 10 కోట్ల ఇస్తామని సీబీఐ ఆఫర్ చేసిందన్నారని చెప్పారు. వివేకా హత్య కేసులో వైఎస్ అవినాష్, భాస్కర్ రెడ్డి, దేవిరెడ్డి శంకర్ రెడ్డి ప్రమేయం ఉందని చెప్పాలని సీబీఐ ఒత్తిళ్లు వస్తున్నాయని.. వారి ఒత్తిడితో తానే చంపానని ఒప్పుకోవాలని సీబీఐ అధికారులు బెదిరింపులు చేశారని సంచలన వ్యాఖ్యల చేశారు గంగాధర్ రెడ్డి.

వివేకా హత్య కేసులో తనకు సంబంధం లేదని… లేని విషయాన్ని ఉన్నట్లు చెప్పేదిలేదన్నాడు గంగాధర్ రెడ్డి. అనంతపురం ఎస్పీ ఫక్కీరప్ప మాట్లాడుతూ… వైఎస్ వివేకా హత్య కేసులో బెదిరింపులపై గంగాధర్ రెడ్డి ఫిర్యాదు చేశారని… గంగాధర్ రెడ్డి కి రక్షణ కల్పిస్తామన్నారు. సీబీఐ, వివేకా అనుచరులు, సీఐ శ్రీరాంపై ఫిర్యాదు చేశామని… డీఎస్పీ స్థాయి అధికారితో విచారణ జరిపిస్తామని హామీ ఇచ్చారు. తప్పుడు సాక్ష్యం చెప్పాలని బెదిరించినట్లు గంగాధర్ చెబుతున్నారని… గంగాధర్ రెడ్డి ఫిర్యాదు లోని అన్ని అంశాలపై విచారణ చేస్తామన్నారు.

Read more RELATED
Recommended to you

Exit mobile version