ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రైతులకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి వైయస్ జగన్ శుభవార్త చెప్పారు. వైయస్సార్ రైతు భరోసా కింద ఈ ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఈ నెల 16వ తేదీన అంటే రేపు… తొలివిడత పెట్టుబడి సాయం అందించేందుకు ఏపీ ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది. ఈ ఏడాది మొత్తం 48 లక్షల మందిని రైతు భరోసా పథకానికి అర్హులుగా గుర్తించింది జగన్ సర్కార్.
వీరిలో 47 లక్షల మంది భూ యజమానులు కాగా 90 వేల మంది అటవీ సాగుదారులు ఉన్నారు. రైతు భరోసా పథకానికి అర్హత పొందిన రైతుల జాబితాలను సామాజిక తనిఖీ కోసం ఇప్పటికే శుక్రవారం నుంచి ఆర్ బి కే లలో ప్రదర్శిస్తున్నారు. వచ్చే అభ్యంతరాలను అధికారులు పరిశీలిస్తున్నారు. ఎవరైనా అనర్హులు ఉంటే వారి పేర్లను తొలగించడంతో పాటు జాబితాలో చోటు దక్కని అర్హుల అభ్యర్థనలను స్వీకరించారు. అనంతరం ఫైనల్ జాబితాను విడుదల చేసి..రేపు డబ్బులు విడుదల చేస్తారు.