బుర్ర లేని లోకేష్ తనకు కొడుకుగా ఎలా పుట్టాడని చంద్రబాబు ప్రతిక్షణం ఏడుస్తుంటాడు – మంత్రి రోజా

-

బుర్ర లేని లోకేష్ తనకి కొడుకుగా ఎలా పుట్టాడని జగన్ ని చూసిన ప్రతిక్షణం చంద్రబాబు ఏడుస్తూ ఉంటాడని ఎద్దేవా చేశారు మంత్రి రోజా. సోమవారం అసెంబ్లీ వద్ద మంత్రి రోజా మీడియాతో మాట్లాడుతూ.. రైతులకు మద్దతు ఇస్తున్నాము అంటూ ఎడ్ల బండిని లాక్కొని వెళ్లిన నారా లోకేష్ ను చూసి జనం నవ్వుకుంటున్నారని మంత్రి రోజా అన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలే సీఎం జగన్ పాలనకు ఉదాహరణ అన్నారు.

కనీసం ఎమ్మెల్యేగా గెలవని లోకేష్ బాబును మంత్రిని చేశారని.. మంత్రిగా లోకేష్ ఏం చేశారని ప్రశ్నించారు. చంద్రబాబుది అధికార దాహం అన్నారు. వ్యవసాయం దండగ అన్న వ్యక్తి చంద్రబాబు అని.. అక్రమ కేసులు పెట్టి రైతుల ఆత్మహత్యలకు చంద్రబాబు కారణమయ్యారని ఆరోపించారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబును పవన్ కళ్యాణ్ ఎందుకు ప్రశ్నించలేదని అన్నారు.

నారా లోకేష్ పార్టీలోకి రావడంతోనే టీడీపీ పతనం మొదలైంది అన్నారు రోజా. పవన్ కళ్యాణ్ కు 175 స్థానాలలో పోటీ చేసే దమ్ముందా? అని ప్రశ్నించారు. ముందు సర్పంచ్ లుగా గెలవండి.. తర్వాత ఎమ్మెల్యేల గురించి ఆలోచించాలని ఎద్దేవా చేశారు.

Read more RELATED
Recommended to you

Latest news