ఏపీ రాజకీయాల్లో పొత్తుల అంశం పెద్ద హాట్ టాపిక్‌గా ఉంది. వచ్చే ఎన్నికల్లో టీడీపీ-జనసేన పొత్తు పెట్టుకుంటాయా? లేదా? అనేది ఇంకా క్లారిటీ రావట్లేదు. కలిసి పోరాడదామని చంద్రబాబు అంటారు..వైసీపీ వ్యతిరేక ఓట్లని చీలనివ్వను అని పవన్ కల్యాణ్ అంటారు…ఖచ్చితంగా పొత్తు పెట్టుకుంటామని మాత్రం చెప్పట్లేదు. అటు జనసేనతో పొత్తులో ఉన్న బీజేపీ మాత్రం..టీడీపీతో కలిసే ప్రసక్తి లేదని, జనసేనతో కలిసే ఎన్నికలకు వెళ్తామని అంటుంది. అవసరమైతే బీజేపీని వదిలేసి పవన్…టీడీపీతో కలుస్తారని మరొక చర్చ కూడా ఉంది.
ఇలా పొత్తులపై రకరకాల అంశంలు తెరపైకి వస్తున్నాయి. అయితే పొత్తు అనేది వైసీపీకి పెద్ద తలనొప్పిగా మారింది. అందుకే ఆ పార్టీ నేతలు..టీడీపీ-జనసేన కలిసి పోటీ చేస్తాయని ఎప్పటినుంచో ప్రచారం చేస్తున్నారు. కాకపోతే రెండు పార్టీలు కలిసినా జగన్ సింగిల్ గా ఎన్నికలకు వెళ్తారని, ఎంతమంది కలిసిన తమకు నష్టం లేదని పైకి చెబుతున్నారు గాని..లోపల మాత్రం టీడీపీ-జనసేన పొత్తు లేకుండా ట్రై చేయడానికి చాలా ఎత్తులు వేస్తున్నారని తెలుస్తోంది.
అందుకే పవన్‌ని చాలావరకు రెచ్చగొడుతున్నారు..దమ్ముంటే అన్నీ స్థానాల్లో పోటీ చేయాలని, చంద్రబాబుని సీఎం చేయడానికే పవన్ పనిచేస్తున్నారని, కాపుల ఓట్లని తాకట్టు పెడుతున్నారని విమర్శలు చేస్తున్నారు. అంటే అన్నీ స్థానాల్లో పోటీ చేస్తే ఓట్లు చీలిపోయి వైసీపీకి బెనిఫిట్ అవుతుందనే కోణం వైసీపీది. అలాగే కాపులని రెచ్చగొట్టి పవన్ వైపుకు వెళ్లకుండా చూసేందుకు ట్రై చేస్తున్నారు.
ఇంకా చెప్పాలంటే పొత్తు గురించి టీడీపీ-జనసేన కంటే వైసీపీనే ఎక్కువ తొందర పడుతుంది. పొత్తు బట్టి వ్యూహాలు మార్చుకోవాలని చూస్తుంది. కానీ బాబు-పవన్ ఏమో పొత్తు అంశాన్ని ఇప్పుడే తేల్చేలా లేరు. దీని వల్ల వైసీపీలో కన్ఫ్యూజన్ ఉంది. అందుకే ఏదొరకంగా పొత్తు లేకుండా చేయడానికి వైసీపీ ట్రై చేస్తుంది..ఇక పొత్తు ఉంటే ఏదొరకంగా వారిని నెగిటివ్ చేసి..జగన్ ఒంటరి అని సింపతీ కొట్టడానికి చూస్తున్నారు. మొత్తానికి పొత్తుపై వైసీపీ బాగా తొందర పడుతుంది.