కోవిడ్ 19కు గాను పతంజలి ఆయుర్వేద సంస్థ కరోనైల్ పేరిట ఓ నూతన ఆయుర్వేద మెడిసిన్‌ను మంగళవారం విడుదల చేసిన విషయం విదితమే. పతంజలి సీఈవో ఆచార్య బాలకృష్ణ, యోగా గురువు బాబా రాందేవ్‌లు ఈ మెడిసిన్‌ను మార్కెట్‌లోకి విడుదల చేశారు. ఉత్తరాఖండ్‌లోని హరిద్వార్ పతంజలి ప్రధాన కార్యాలయంలో ఈ ఔషధాన్ని ఆవిష్కరించారు. అయితే ప్రస్తుతం అందుబాటులో ఉన్న ఇంగ్లిష్ మెడిసిన్స్‌తో పోలిస్తే కరోనైల్ మెడిసిన్ చాలా తక్కువ సమయంలోనే కరోనాను నయం చేస్తుందని వెల్లడైంది.
కోవిడ్ 19కు గాను కరోనైల్ మెడిసిన్‌తో క్లినికల్ ట్రయల్స్ చేపట్టామని, వాటిల్లో ఆ ఔషధాన్ని తీసుకున్న 69 శాతం మంది పేషెంట్లకు కేవలం 3 రోజుల్లోనే కరోనా నయమైందని, మరో 7 రోజల్లో మిగిలిన పేషెంట్లందరూ కరోనా నుంచి కోలుకున్నారని, దీంతో కరోనైల్ మెడిసిన్ 100 శాతం అనుకూల ఫలితాలను సాధించిందని.. బాబా రాందేవ్ తెలిపారు.
కాగా ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న అనేక రకాల ఇంగ్లిష్ మెడిసిన్స్‌తో కరోనాను నయం చేసేందుకు 14 రోజుల వరకు సమయం పడుతుండడంతో పతంజలి ఆవిష్కరించిన కరోనైల్ మెడిసిన్ జనాలకు ఎంతో ఊరటనిస్తోంది. ఇంగ్లిష్ మెడిసిన్ కన్నా చాలా తక్కువ సమయంలోనే ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ లేకుండా కరోనా నుంచి బయట పడే అవకాశాన్ని కరోనైల్ మెడిసిన్ మనకు అందిస్తోంది.