వినూత్న‌మైన సీలింగ్ ఫ్యాన్‌ను లాంచ్ చేసిన హావెల్స్‌.. ఎయిర్ ప్యూరిఫైర్ స‌దుపాయం‌..!

ప్ర‌ముఖ ఎల‌క్ట్రిక‌ల్ ఉప‌క‌ర‌ణాల త‌యారీ సంస్థ హావెల్స్ ఓ నూత‌న త‌ర‌హా సీలింగ్ ఫ్యాన్‌ను విడుద‌ల చేసింది. అందులో 3 స్టేజ్ ఎయిర్ ప్యూరిఫైర్‌ను ఏర్పాటు చేశారు. అందువ‌ల్ల ఈ ఫ్యాన్ కేవ‌లం గాలిని అందించ‌డం మాత్ర‌మే కాకుండా దాన్ని శుద్ధి కూడా చేస్తుంది. దేశంలోనే ఈ త‌ర‌హా సీలింగ్ ఫ్యాన్ ఇదే మొద‌టిది కావ‌డం విశేషం.

havells 3 stage air purifying ceiling fan launched in india

హావెల్స్ లాంచ్ చేసిన 3 స్టేజ్ ఎయిర్ ప్యూరిఫైర్ సీలింగ్ ఫ్యాన్ ధ‌ర రూ.15వేలుగా ఉంది. ఇందులో యాక్టివేటెడ్ కార్బ‌న్ ఫిల్ట‌ర్ల‌ను ఏర్పాటు చేశారు. అందువ‌ల్ల గాలిలో ఉండే పీఎం 2.5, పీఎం 10 కాలుష్య కార‌కాలు, విష ప‌దార్థాలు, అణువులు తొల‌గించ‌బ‌డ‌తాయి. వినియోగ‌దారుల‌కు స్వ‌చ్ఛ‌మైన గాలి ల‌భిస్తుంది. గంట‌కు 130 క్యుబిక్ మీట‌ర్ల గాలిని ఈ ఫ్యాన్ శుద్ధి చేసి అందిస్తుంది.

ఈ ఫ్యాన్‌కు రిమోట్ కంట్రోల్ ఆప‌రేష‌న్ స‌దుపాయం క‌ల్పించారు. దీనిపై లైట్ ఉంటుంది. ఎయిర్ ప్యూరిటీని తెలియ‌జేసే ఎల్ఈడీ లైట్ ఉంటుంది. ఇక ఈ ఫ్యాన్‌తోపాటు హావెల్స్ ఫ్యాన్‌మేట్ అనే మ‌రో ఉత్ప‌త్తిని కూడా లాంచ్ చేసింది. ఈ డివైస్ గాలిలో ఉండే దుర్వాస‌న‌ను తొల‌గిస్తుంది. అందుకు గాను ఇందులో కూడా కార్బ‌న్ ఫిల్ట‌ర్ల‌ను ఏర్పాటు చేశారు. ఈ డివైస్ 3 గంట‌ల బ్యాట‌రీ బ్యాక‌ప్‌ను ఇస్తుంది.