ఈ జనరేషన్ ఎక్కువగా ఉపయోగిస్తున్న చాట్ యాప్స్‌లో నంబర్ వన్ స్థానంలో ఉంటుంది వాట్సాప్. స్కూల్ పిల్లల నుంచి ముసలి వాళ్ల వరకు అందరూ వాట్సాప్‌లో ఉంటున్నారు. రకరకాల గ్రూప్స్‌లో జాయిన్ అవుతూ అందులో వచ్చే ఫన్ మెసేజెస్, కంటెంట్‌తో చిల్ అవుతున్నారు. అయితే కొన్నిసార్లు మనకు కొందరి నుంచి వచ్చే సందేశాలు నచ్చవు. అలాగని వాళ్లను బ్లాక్ చేయలేము. వాళ్లు ఏం పంపారో మనకు తెలుసుకోవాలని ఉంటుంది కానీ రిప్లై ఇవ్వాలి అనిపించదు. చూసి రిప్లై ఇవ్వకపోతే మళ్లీ వాళ్లు బాధపడతారేమోనని అనిపిస్తుంది. మనం వాట్సాప్‌లో మెసేజ్ చూడాలి.. కానీ మనం చూసినట్టు ఎదుటివాళ్లకు తెలియకూడదు. ఇదెలా సాధ్యం. సాధ్యమేనండోయ్.. అది ఎలాగో తెలుసుకుందాం రండి.
వాట్సాప్‌లో మనం మెసేజ్ చదివితే బ్లూటిక్ వస్తుంది. బ్లూటిక్ లేకపోతే చదవలేదని అర్థం. మనం మెసేజ్ చదివిన విషయంలో ఎదుటివాళ్లకు తెలియకుండా ఉండటమనేది సాధ్యమవుతుంది. అదీ థర్డ్ పార్టీ యాప్‌లతో పనిలేకుండా. ఎలాగంటే..? రీడ్ రిసిప్ట్స్‌ను డిసేబుల్ చేయటం, చిన్నపాటి ఉపాయాలతో ఆఫ్‌లైన్‌లో చూడటం ద్వారా దీన్ని సాధించొచ్చు.
వాట్సాప్‌ను ఓపెన్ చేసి నిలువు మూడు చుక్కల మీద నొక్కాలి. తర్వాత సెటింగ్స్‌ను ఎంచుకొని, అకౌంట్ ఆప్షన్ మీద ట్యాప్ చేయాలి. ‘ప్రైవసీ’ విభాగం మీద తాకి అడ్వాన్స్డ్ ఫీచర్లను పరిశీలించాలి. రీడ్ రిసిప్ట్స్ ఫీచర్‌ను డిసేబుల్ చేయాలి. అంతే.
రహస్యంగా మెసేజ్‌లను చదవటానికి ఉన్న మరో మార్గం నోటిఫికేషన్ బార్ ద్వారా చదవటం. వాట్సాప్ మెసేజ్ నోటిఫికేషన్ అందిన వెంటనే దాన్ని కిందికి జరిపి చదివితే చాలు.
వాట్సాప్ సెటింగ్స్‌ను ఓపెన్ చేసి, నోటిఫికేషన్స్ మీద తాకాలి. పాపప్ నోటిఫికేషన్ ఫీచర్‌ను సెలెక్ట్ చేసుకోవాలి. ఇందులో ఓన్లీ వెన్ ద స్క్రీన్ ఈజ్ ఆఫ్, ఆల్వేస్ షో పాపప్, ఓన్లీ వెన్ స్క్రీన్ ఈజ్ ఆన్.. ఈ మూడు ఆప్షన్లలో ఏదైనా ఒకటి ఎంచుకోవాలి.అప్పుడు నోటిఫికేషన్లు పాపప్ రూపంలో కనిపిస్తాయి. వాటిని చదివితే బ్లూటిక్ పడదు.
వాట్సాప్ మెసేజ్‌లను విడ్జెట్ ద్వారా చదవాలని అనుకుంటే.. వాట్సాప్‌ను హోం స్క్రీన్ మీదికి తెచ్చుకుంటే చాలు. యాప్‌ను ఓపెన్ చేయకుండానే అన్ని మెసేజ్‌లనూ చదవొచ్చు.