సూపర్ ఫీచర్లు కలిగిన ఈ ల్యాప్‌టాప్ ధర రూ.30వేల లోపే..!

-

ఒకప్పుడు ఇంట్లో టీవీ ఉంటేనే గొప్పు. కొన్నేళ్ల తర్వాత ఇంటికో ఫోన్ ఉంటే వాళ్లు చాలా ధనవంతులనేవారు. ఇప్పుడు ఫోన్ లేని ఇల్లు లేదు. కరోనా పుణ్యమా అని లాక్ డౌన్, ఆన్ లైన్ క్లాసుల వల్ల ఫోన్ తో పాటు ప్రతి ఇంటా ల్యాప్‌టాప్కూడా చేరింది. కానీ కొందరు పేద, మధ్యతరగతి వాళ్లు ల్యాప్‌టాప్కొనగలిగే స్తోమత లేక వారి పిల్లలు ఫోన్ తోనే సర్దిపెట్టుకున్నారు. అయితే మిడిల్ క్లాస్ వారి కోసం ఇన్‌ఫీనిక్స్ బంపర్ ఆఫర్లు తీసుకొచ్చింది. రూ.30వేలు అంతకన్నా తక్కువ ధరలో సరికొత్త టెక్నాలజీతో కూడిన ల్యాప్‌టాప్ లను లాంచ్ చేసింది. మరి వాటి సంగతేంటో చూసి మీరూ కొనేయండి..

ఇన్‌ఫీనిక్స్ ఇటీవలే మనదేశంలో ఇన్‌బుక్ ఎక్స్1 అనే కొత్త ల్యాప్‌టాప్‌ను లాంచ్ చేసిన సంగతి తెలిసింది. ఈ ల్యాప్‌టాప్ సేల్ ఇప్పుడు మనదేశంలో ప్రారంభం అయింది. ఇందులో 14 అంగుళాల డిస్‌ప్లే, 10వ జనరేషన్ఇంటెల్ కోర్ ప్రాసెసర్, 50డబ్ల్యూహెచ్ బ్యాటరీ అందించనున్నారు. 65W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఈ ల్యాప్‌టాప్ సపోర్ట్ చేయనుంది. 16 జీబీ వరకు ర్యామ్‌ను ఇన్‌ఫీనిక్స్ ఇందులో అందించడం విశేషం.

ఇన్‌ఫీనిక్స్ ఇన్‌బుక్ ఎక్స్1 స్లిమ్ ధర.. ఇందులో మూడు వేరియంట్లు లాంచ్ అయ్యాయి. వీటిలో ఐ3 + 8 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.29,990గానూ, ఐ3 + 8 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.32,990గానూ ఉంది. ఐ5 + 8 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.39,990గానూ, ఐ5 + 16 జీబీ ర్యామ్ + 512 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర రూ.44,990గా నిర్ణయించారు. గ్రే, బ్లూ, గ్రీన్, రెడ్ కలర్ వేరియంట్లలో ఈ ల్యాప్‌టాప్ కొనుగోలు చేయవచ్చు. కోటక్ బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ బరోడా క్రెడిట్ కార్డుల ద్వారా ఈ ల్యాప్‌టాప్ కొంటే రూ.1,500 వరకు తగ్గింపు లభించనుంది.

ఇన్‌ఫీనిక్స్ ఇన్‌బుక్ ఎక్స్1 స్లిమ్ ఫీచర్లు.. ఫుల్ మెటల్ బాడీ, అల్యూమినియం అలోయ్‌తో ఈ ల్యాప్‌టాప్‌ను రూపొందించారు. 14 అంగుళాల ఫుల్ హెచ్‌డీ ఐపీఎస్ డిస్‌ప్లే ఇందులో ఉంది. దీని స్క్రీన్ పిక్సెల్ రిజల్యూషన్ 1920 x 1080 పిక్సెల్స్‌గా ఉంది. డిస్‌ప్లే యాస్పెక్ట్ రేషియో 16:9 కాగా, 10వ తరం ఇంటెల్ కోర్ ప్రాసెసర్లు ఇందులో ఉన్నాయి. 16 జీబీ వరకు ర్యామ్, 512 జీబీ వరకు ఎస్ఎస్‌డీ స్టోరేజ్‌లను ఇన్‌ఫీనిక్స్ అందించింది.

విండోస్ 11 ఆపరేటింగ్ సిస్టంపై ఇన్‌ఫీనిక్స్ ఇన్‌బుక్ ఎక్స్1 స్లిమ్ పనిచేయనుంది. ఇందులో 50 డబ్ల్యూహెచ్ బ్యాటరీ అందించారు. 65W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా ఇన్‌ఫీనిక్స్ ఇన్‌బుక్ ఎక్స్1 స్లిమ్ సపోర్ట్ చేయనుంది. ఒక్కసారి పూర్తిగా చార్జ్ చేస్తే 11 గంటల బ్రౌజింగ్, 11 గంటల వెబ్ బ్రౌజింగ్, 9 గంటల రెగ్యులర్ వర్క్, 9 గంటల వీడియో ప్లేబ్యాక్ చేయవచ్చు. ఈ ల్యాప్‌టాప్ పూర్తిగా చార్జ్ అవ్వడానికి 90 నిమిషాల సమయం పట్టనుందని కంపెనీ తెలిపింది.

Read more RELATED
Recommended to you

Latest news