యాపిల్ నుంచి మరో రెండు ల్యాప్ టాప్ లు లాంచ్..2022 ఫీచర్లు..

-

సరికొత్త ఫీచర్స్ తో రెండు ల్యాప్ టాప్ లను మార్కెట్ లోకి విడుదల చేసింది యాపిల్..ప్రస్తుతం జరుగుతున్న వరల్డ్‌వైడ్ డెవలపర్స్ కాన్ఫరెన్స్ 2022 సందర్భంగా ఎం2 చిప్‌ను యాపిల్ ప్రవేశపెట్టింది. ఆ చిప్‌తో మ్యాక్‌బుక్ ఎయిర్ , 13 ఇంచుల మ్యాక్‌బుక్ ప్రో మోడళ్లను లాంచ్ చేసింది. 2020లో లాంచ్ చేసిన ఎం1కు సక్సెసర్‌గా ఎం2 చిప్‌ను యాపిల్ తీసుకొచ్చిందిరెండు ల్యాప్‌టాప్‌లు 13 ఇంచుల లిక్విడ్ రెటీనా LCD డిస్‌ప్లేతో వస్తున్నాయి. అలాగే ఫ్లాగ్‌షిప్ స్పెసిఫికేషన్లు ఉన్నాయి.

 

యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్..

యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ (2022)లో లేటెస్ట్ ఎం2 చిప్‌సెట్ ఉంది. 2020 మ్యాక్‌బుక్ ఎయిర్‌లో ఉన్న ఎం1 యాపిల్ సిలికాన్ చిప్‌తో పోలిస్తే ఇది శక్తివంతమైనది. ఎం1తో పోలిస్తే ఎం2 చిప్ ద్వారా 18శాతం మెరుగైన సీపీయూ పర్ఫార్మెన్స్, 35 శాతం జీపీయూ పర్ఫార్మెన్స్ ఉంటుందని యాపిల్ ప్రకటించింది. 1.9 రెట్లు సీపీయూ స్పీడ్ ఎక్కువగా ఉంటుందని వెల్లడించింది..
2022 మోడల్‌లో 2TB వరకు SSD స్టోరేజ్ ఉంటుంది. 24GB వరకు యునిఫైడ్ మెమరీ ఉంటుంది. వీడియో కాల్స్ కోసం 1080 కెమెరా ఉంటుంది.మ్యాక్‌బుక్ ఎయిర్ (2022)కు రెండు యూఎస్‌బీ టైప్-సీ పోర్ట్‌లు, 4 థండర్‌బోల్ట్ పోర్ట్‌లు, 3.5mm హెడ్‌ఫోన్ జాక్ ఉన్నాయి. ఫుల్ చార్జ్‌పై ఈ ల్యాప్‌టాప్ 18 గంటల బ్యాటరీ లైఫ్ వస్తుంది..కేవలం 30 నిమిషాల్లోనే ఫుల్ చార్జ్ అవుతుంది.

యాపిల్ మ్యాక్‌బుక్ ప్రో..

అధునాతన M2 Chip ఉంటుంది. గరిష్ఠంగా 24జీబీ వరకు యునిఫైడ్ మెమరీ, 2టీబీ వరకు SSD స్టోరేజ్ ఉంటుంది. ఈ మ్యాక్‌బుక్.. 13 ఇంచుల లిక్విడ్ రెటీనా డిస్‌ప్లేతో వస్తుంది. 500 నిట్స్ పీక్‌బ్రైట్‌నెస్, పీ3 కలర్ సపోర్ట్ ఉంటుంది.మ్యాక్‌బుక్ ఎయిర్ లాగే ఇందులో కూడా యాక్టివ్ కూలింగ్ సిస్టమ్ ఉంది. ఒక్కసారి ఫుల్ చార్జ్ చేస్తే ఈ ల్యాప్‌టాప్ 20 గంటల బ్యాటరీ లైఫ్ ఇస్తుంది..దీనికి కూడా 30 లోపు ఫుల్ చార్జ్ అవుతుంది.

ధరలు..

యాపిల్ మ్యాక్‌బుక్ ఎయిర్ ప్రారంభ ధర సుమారు రూ.93,300, 13 ఇంచుల మ్యాక్‌బుక్ ప్రో ప్రారంభ ధర రూ.1,01,000గా ఉంది. మ్యాక్‌బుక్ ఎయిర్ మోడల్ మిడ్‌నైట్, స్పేస్ గ్రే, స్టార్‌లైట్ గోల్డ్ కలర్ ఆప్షన్‌లలో లభ్యం కానుంది. అలాగే ఎం1 చిప్‌ ఉన్న మ్యాక్‌బుక్ ఎయిర్ మోడల్ ధర సుమారు రూ.77,500గానే ఉంటుందని యాపిల్ తాజాగా ప్రకటించింది..

Read more RELATED
Recommended to you

Latest news