మార్కెట్ లో స్మార్ట్ ఫోన్లకు కొదవే లేదు. రోజుకో ఫోన్ ఏదో ఒక దేశంలో లాంఛ్ అవుతూనే ఉంటుంది. మన దేశంలో లావా జెడ్ సిరీస్ లో భాగంగా.. కొత్త బడ్జెట్ స్మార్ట్ ఫోన్ ను లాంచ్ చేసింది. Lava Z3 Pro ను కంపెనీ ఇండియాలో విడుదల చేసింది. ఈG ఫోన్ ధర, స్పెసిఫికేషన్లు ఎలా ఉన్నాయో చూద్దామా..!
లావా జెడ్3 ప్రో ధర..
దీని ధరను రూ.7,499గా నిర్ణయించారు. స్ట్రైప్డ్ బ్లూ, స్టైప్డ్ సియాన్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
లావా జెడ్3 ప్రో హైలెట్స్..
6.5 అంగుళాల ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు.
స్క్రీన్ రిజల్యూషన్ 720 x 1600 పిక్సెల్స్‌గా ఉంది.
కార్నింగ్ గొరిల్లా గ్లాస్ 3 ప్రొటెక్షన్ కూడా ఇందులో ఉంది.
దీని యాస్పెక్ట్ రేషియో 20:9గా ఉంది.
క్వాడ్‌కోర్ మీడియాటెక్ హీలియో ఏ25 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
3 జీబీ ర్యామ్, 32 జీబీ స్టోరేజ్ ఇందులో ఉంది.
స్టోరేజ్‌ను మైక్రోఎస్‌డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది.
ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంను ఇందులో అందించారు.
ఫోన్ వెనకవైపు ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను అందించారు.
దీని మందం 0.89 సెంటీమీటర్లు కాగా.. బరువు 192 గ్రాములుగా ఉంది.
కెమేరా క్వాలిటీ..
ఈ ఫోన్ వెనకవైపు రెండు కెమేరాలు అందించారు. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 8 మెగాపిక్సెల్ కాగా… దీంతోపాటు సెకండరీ లెన్స్ కూడా ఉన్నాయి. బ్యూటీ మోడ్, హెచ్‌డీఆర్ మోడ్, నైట్ మోడ్, పొర్‌ట్రెయిట్ మోడ్ వంటి కెమెరా ఫీచర్లు ఇందులో ఉన్నాయి. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 5 మెగాపిక్సెల్ అందించారు. ప్రస్తుతం లావా ఆన్‌లైన్ స్టోర్‌లో దీన్ని కొనుగోలు చేయవచ్చు.
ప్రస్తుతం కష్టమర్స్ బడ్జెట్ ఫోన్లు కొనుగోలు చేసేందుకే ఇష్టపడుతున్నారు. పది నుంచి పదిహేను వేలలోపు ఏదైనా ఫోన్ తీసుకుని రెండేళ్లు వాడేసి.. మళ్లీ కొత్తది చూస్తున్నారు. కంపెనీలు కూడా.. కాస్ట్ ఎక్కువ ఉన్న ఫోన్ల కంటే.. బడ్జెట్ ఫోన్లు తయారు చేసేందుకు అధిక ప్రాధాన్యం ఇస్తుంది. రూ. 5 వేల నుంచి కూడా స్మార్ట్ ఫోన్లు అందుబాటులో ఉంటున్నాయి.