లాంచ్‌ అయిన Oppo A57 2022… ఫీచర్స్‌ ఇవే..!

-

ఒప్పో నుంచి ఎప్పడూ ఏదో ఒక స్మార్ట్‌ ఫోన్‌ లాంచ్‌ అవుతూనే ఉంటుంది. తాజాగా ఏ సిరీస్‌లో భాగంగా. ఒప్పో ఏ 57 (2022) స్మార్ట్‌ ఫోన్‌ ధాయిలాండ్‌లో లాంచ్‌ అయింది. ఇది ఒక బడ్జెట్‌ స్మార్ట్‌ ఫోన్.. మరి ఈ ఫోన్‌ ఫీచర్స్, కాస్ట్ ఎంతుందో చూద్దామా.!

ఒప్పో ఏ57 (2022) ధర

ఈ ఫోన్‌ ధరను 5,499 థాయ్ బాత్‌లుగా అంటే మన కరెన్సీలో సుమారు రూ.12,500గా నిర్ణయించారు.
గ్లోయింగ్ బ్లాక్, గ్లోయింగ్ గ్రీన్ కలర్ ఆప్షన్లలో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.

ఒప్పో ఏ57 (2022) స్పెసిఫికేషన్లు..

ఆండ్రాయిడ్ 12 ఆధారిత కలర్ఓఎస్ 12.1 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
6.56 అంగుళాల హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను ఇందులో అందించారు.
ఫోన్ వెనకవైపు 13 మెగాపిక్సెల్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్‌లను అందించారు. ముందువైపు 8 మెగాపిక్సెల్ కెమెరా ఉంది.
3 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్‌ను ఇందులో అందించారు.
స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా పెంచుకునే అవకాశం ఉంది.
ఆక్టాకోర్ మీడియాటెక్ హీలియో జీ35 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
4జీ ఎల్టీఈ, వైఫై, బ్లూటూత్ వీ5.0, జీపీఎస్, యూఎస్‌బీ టైప్-సీ పోర్టులు కూడా ఈ ఫోన్‌లో ఉన్నాయి.
ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు.
దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఒప్పో ఏ57 (2022) సపోర్ట్ చేయనుంది.
దీని మందం 0.79 సెంటీమీటర్లు కాగా… బరువు 187 గ్రాములుగా ఉంది.

అయితే… ఒప్పో ఏ57 (2022) మనదేశంలో ఎప్పుడు లాంచ్ కానుందో ఇంకా తెలియరాలేదు. ఒప్పో అంటేనే సెల్ఫీ ఎక్స్‌పట్‌ అని టాక్‌. అందులోనూ అమ్మాయిలు ఎక్కువగా ఒప్పో ఫోన్‌ వాడుతుంటారు. ఈ బడ్జెట్‌లో ఫోన్ ఇండియన్‌ మార్కెట్‌లో విడుదలైతే.. కచ్చితంగా కష్టమర్స్‌ను ఆకట్టుకుంటుందనే చెప్పాలి.

Read more RELATED
Recommended to you

Latest news