ఇండియాలో లాంచ్‌ అయిన Poco X5 Pro 5G..

-

పోకో నుంచి కొత్త ఫోన్‌ ఇండియాలో లాంచ్‌ అయింది. అదే పోకో ఎక్స్5 ప్రో 5జీ. ఇది మొత్తం రెండు వేరియంట్లల్లో విడుదలైంది. 108 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 120 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్ ఫుల్ హెచ్‍డీ+ అమోలెడ్ డిస్‍ప్లేతో మిడ్ రేంజ్‍లో ఈ ఫోన్ అడుగుపెట్టింది. ఇంకా ఫోన్‌కు సంబంధించిన ధర, స్పెసిఫికేషన్స్‌ వివరాలు ఇలా ఉన్నాయి.

పోకో ఎక్స్5 ప్రో 5జీ ధర, సేల్, ఆఫర్..

 పోకో ఎక్స్5 ప్రో 5జీ ఫోన్ రెండు వేరియంట్లలో విడుదలైంది. 6జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ బేస్ వేరియంట్ ధర రూ.22,999, 8జీబీ ర్యామ్ + 256జీబీ స్టోరేజ్ టాప్ మోడల్ ధర రూ.24,999గా ఉంది.
ఆస్ట్రల్ బ్లాక్, హారిజన్ బ్లూ, ఎల్లో కలర్ ఆప్షన్‍లలో ఈ మొబైల్ లభిస్తుంది.
 ఈనెల 13వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు ఈ-కామర్స్ సైట్ ఫ్లిప్‍కార్ట్‌లో Poco X5 Pro 5G పూర్తిస్థాయిలో సేల్‍కు వస్తుంది.
పోకో ఎక్స్5 ప్రో 5జీ ఫోన్‍ను ఐసీఐసీఐ క్రెడిట్ కార్డుతో కొంటే రూ.2,000 అదనపు డిస్కౌంట్ పొందవచ్చు. అంటే రూ.20,999కే బేస్ వేరియంట్‍ను దక్కించుకోవచ్చు.

పోకో ఎక్స్5 ప్రో 5జీ స్పెసిఫికేషన్లు, ఫీచర్స్..

6.67 ఇంచుల అమోలెడ్ డిస్‍ప్లేని పోకో ఎక్స్5 ప్రో 5జీ కలిగి ఉంది.
120 హెర్ట్జ్ అటాప్టివ్ రిఫ్రెష్ రేట్, 900 నిట్స్ పీక్ బ్రైట్‍నెస్, హెచ్‍డీఆర్ 10+ సపోర్ట్, గొరిల్లా గ్లాస్ 5 ప్రొటెక్షన్.. డిస్‍ప్లే ఫీచర్లుగా ఉన్నాయి.
స్నాప్‍డ్రాగన్ 778జీ ప్రాసెసర్‌పై ఈ నయా పోకో ఫోన్ రన్ అవుతుంది.
పోకో ఎక్స్5 ప్రో 5జీ మొబైల్‍లో 5,000mAh బ్యాటరీ ఉంది.
67 వాట్ల ఫాస్ట్ చార్జింగ్ సపోర్టును కలిగి ఉంది. డ్యుయల్ స్టీరియో స్పీకర్లతో ఈ ఫోన్ వస్తోంది.
డాల్బీ అట్మోస్ సపోర్ట్ ఉంటుంది.

కెమెరా సామర్థ్యం..

పోకో ఎక్స్5 ప్రో 5జీ వెనుక మూడు కెమెరాల సెటప్ ఉంది.
108 మెగాపిక్సెల్ ISOCELL HM2 ప్రైమరీ కెమెరా, 8 మెగాపిక్సెల్ అల్ట్రా వైడ్ కెమెరా, 2 మెగాపిక్సెల్ మాక్రో కెమెరా ఉన్నాయి.
వీడియో కాల్స్, సెల్ఫీల కోసం 16 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరాను ఈ మొబైల్‍ను పోకో ఇచ్చింది.
ఆండ్రాయిడ్ 12 బేస్డ్ ఎంఐయూఐ 14 ఆపరేటింగ్ సిస్టమ్‍తో Poco X5 Pro 5G వస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news