త్వరలో లాంచ్‌ కానున్న రెడ్‌మీ నోట్‌ 12 సిరీస్‌ స్మార్ట్‌ ఫోన్లు.. ఛార్జింగ్‌ స్పీడ్‌ అదుర్స్..

-

రెడ్‌మీ నోట్ 12 సిరీస్ స్మార్ట్ ఫోన్లు ఈ ఏడాది చైనాలో లాంచ్ కానున్నాయి. ఈ సిరీస్‌లో రెడ్‌మీ నోట్ 12, రెడ్‌మీ నోట్ 12 ప్రో, రెడ్‌మీ నోట్ 12 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్లు ఉండనున్నట్లు సమాచారం. వీటి గ్లోబల్ లాంచ్ 2023లో జరగనుంది. ఇంకా ఈ ఫోన్లకు సంబంధించి అందిన వివరాలు ఇలా ఉన్నాయి..

ఈ ఫోన్లు చైనా కంపల్సరీ సర్టిఫికేషన్ (3సీ) డేటాబేస్‌లో ఇప్పటికే కనిపించాయి. ఈ లిస్టింగ్‌లో వీటి ఫాస్ట్ చార్జింగ్ కెపాసిటీలు రివీల్ అయ్యాయి. రెడ్‌మీ నోట్ 12 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్ 210W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది తెలుస్తోంది. రెడ్‌మీ నోట్ 12 స్మార్ట్ ఫోన్ 22101316C మోడల్ నంబర్‌తో, రెడ్‌మీ నోట్ 12 ప్రో స్మార్ట్ ఫోన్ 22101316UCP మోడల్ నంబర్‌తో, రెడ్‌మీ నోట్ 12 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్ 22101316UC మోడల్ నంబర్‌తోనూ 3సీ డేటాబేస్‌లో కనిపించాయి.

రెడ్‌మీ నోట్ 12 స్మార్ట్ ఫోన్ 67W ఫాస్ట్ చార్జింగ్, రెడ్‌మీ నోట్ 12 ప్రో స్మార్ట్ ఫోన్ 120W ఫాస్ట్ చార్జింగ్, రెడ్‌మీ నోట్ 12 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్ 210W ఫాస్ట్ చార్జింగ్‌లను సపోర్ట్ చేయనున్నట్లు 3సీ వెబ్ సైట్ ద్వారా లీక్ అయింది. రెడ్‌మీ నోట్ 12 సిరీస్ ఈ సంవత్సరం ఏప్రిల్‌లోనే నెట్‌వర్క్ యాక్సెస్ లైసెన్స్‌ను పొందాల్సి ఉంది.

రెడ్‌మీ నోట్ 12 ప్రో, రెడ్‌మీ నోట్ 12 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్లు టెనా డేటాబేస్‌లో కూడా కనిపించాయి. ఇందులో 6.6 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ అమోఎల్ఈడీ డిస్‌ప్లే ఉండనుంది.

రెడ్‌మీ నోట్ 12 ప్రో స్మార్ట్ ఫోన్‌లో 4980 ఎంఏహెచ్ బ్యాటరీ, రెడ్‌మీ నోట్ 12 ప్రో ప్లస్ స్మార్ట్ ఫోన్‌లో 4300 ఎంఏహెచ్ బ్యాటరీ అందించనున్నారు. రెడ్‌మీ నోట్ 12 స్మార్ట్ ఫోన్‌లో 50 మెగాపిక్సెల్ కెమెరాను అందించారు. రెడ్‌మీ 11 తరహాలో స్ట్రయిట్ ఎడ్జెస్ ఉన్న రెక్టాంగులర్ డిజైన్‌తో ఈ ఫోన్ లాంచ్ కానుంది. ఈ ఫోన్ త్వరలో లాంచ్ కానుందని లేటెస్ట్ డెవలప్‌మెంట్స్‌ను బట్టి చెప్పవచ్చు.

Read more RELATED
Recommended to you

Latest news