TCL Stylus 5G స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసిన కంపెనీ.. తక్కువ ధరకే స్టైలస్ సపోర్ట్

-

ఇండియాలో టీవీలు ఎక్కువగా లాంచ్‌ చేసే.. టీసీఎల్‌ బ్రాండ్‌ అమెరికాలో కొత్త స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌ చేసింది. టీసీఎల్ స్టైలస్ 5జీ పేరుతో ఈ ఫోన్‌ విడుదలైంది. ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది. ఈ ఫోన్‌ కాస్ట్‌, ఫీచర్స్‌ ఎలా ఉన్నాయో మీరు ఓ లుక్కేయండి.!

టీసీఎల్ స్టైలస్ 5జీ ధర..

ఈ ఫోన్ ధరను అమెరికాలో 258 డాలర్లుగా అంటే..సుమారు రూ.20,000గా నిర్ణయించారు.
సింగిల్ లూనార్ బ్లాక్ కలర్ ఆప్షన్‌లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
స్టైలస్ సపోర్ట్ ఉన్న ఫోన్ ఇంత తక్కువ ధరకు రావడం ఇదే ప్రథమం.
మనదేశంలో ఈ ఫోన్ లాంచ్ కానుందో లేదో తెలియరాలేదు.

టీసీఎల్ స్టైలస్ 5జీ స్పెసిఫికేషన్లు..

ఇందులో 6.81 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు.
దీని యాస్పెక్ట్ రేషియో 20.5:9గా ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
4 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ అందించారు.
దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 2 టీబీ వరకు పెంచుకోవచ్చు.

ఇక కెమెరాల విషయానికి వస్తే…

ఫోన్‌కు వెనకవైపు నాలుగు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా… దీంతోపాటు 5 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ సెన్సార్, 2 మెగాపిక్సెల్ మాక్రో లెన్స్, 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ అందించారు.
సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 13 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఉంది.

బ్యాటరీ సామర్థ్యం..

4000 ఎంఏహెచ్ బ్యాటరీని ఇందులో అందించారు.
18W ఫాస్ట్ చార్జింగ్‌ను ఇది సపోర్ట్ చేయనుంది.
ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు.
బ్లూటూత్ వీ5.2, ఎన్ఎఫ్‌సీ, డ్యూయల్ బ్యాండ్ వైఫై, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు, 3.5 ఎంఎం హెడ్ ఫోన్ జాక్ కూడా ఉన్నాయి.
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై టీసీఎల్ స్టైలస్ 5జీ పనిచేయనుంది.

Read more RELATED
Recommended to you

Latest news