ఇప్పుడు మార్కెట్‌లో వచ్చే ఫోన్లు..కెమెరా, ఛార్జింజ్ టైమ్ మీద ఎక్కువ ఫోకస్ చేస్తున్నాయి. కష్టమర్స్‌కు ఛార్జింగ్ ఎంత తక్కువటైమ్‌లో ఫుల్ అయితే..అంట టైమ్ సేవ్ అవుతుంది. చైనాకు చెందిన రియల్‌మీ సంస్థ ఈ ఫీచర్‌తో కొత్త ఫోన్‌ను తీసుకొస్తోంది. కేవలం 10 నిమిషాల్లోనే ఫోన్ పూర్తిగా ఛార్జ్ అయితే ఎలా ఉంటుంది..? త్వరలోనే దీన్ని మార్కెట్లోకి విడుదల చేయనుంది.ఇందులో భాగంగానే చైనా కంపెనీ రియల్‌మీ నూతన స్మార్ట్‌ఫోన్‌ని విడుదల చేస్తోంది. కేవలం 10 నిమిషాల్లోనే పూర్తిగా ఛార్జ్ చేసుకునే ‘Realme GT Neo 5’ ఫోన్‌ను రియల్‌మీ రూపొందించింది. 240వాట్ల ఫాస్ట్ ఛార్జింగ్‌కు ఈ ఫోన్ సపోర్ట్ చేయగలదని కంపెనీ ప్రకటించింది. ప్రపంచంలోనే తొలిసారి ఇలాంటి ఫోన్‌ను పరిచయం చేస్తున్నట్లు రియల్‌మీ తెలిపింది. 10 నిమిషాల్లోనే పూర్తిగా ఛార్జ్ అయ్యే ఫోన్ ఇప్పటివరకు మార్కెట్లో లేదట..
ఇది తొలి 4 నిమిషాల్లో 50శాతం ఛార్జింగ్ పూర్తి చేసుకుందని, 10 నిమిషాల్లోపే 100శాతం పూర్తయిందని రియల్‌మీ తెలిపింది..
240వాట్స్ ఛార్జింగ్ కెపాసిటీ వల్లే ఇది సాధ్యమైందని కంపెనీ వెల్లడించింది. ‘GT Neo 5’లో mAh లిథియం-పాలిమర్(Li-Po) బ్యాటరీని అమర్చినట్లు తెలిపింది. ఇది నాన్ రిమూవబుల్ బ్యాటరీ. త్వరగా ఛార్జ్ చేసుకున్నప్పటికీ.. బ్యాటరీ బ్యాకప్ ఎంత సేపు వస్తుందనే విషయాన్ని మాత్రం కంపెనీ వెల్లడించలేదు. సాధారణంగా.. త్వరగా ఛార్జింగ్ ఎక్కితే.. అంతే త్వరగా డౌన్ అయిపోతుందని చాలా మంది అనుకుంటారు. మరీ ఈ విషయంపై కంపెనీ కూడా ఎలాంటి సమాధానం ఇవ్వలేదు. 240వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీతో పాటు 150వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీతో రియల్‌మీ మరో ఫోన్‌ను లాంచ్ చేస్తోంది. ఈ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 5000mahగా ఉండనుంది.
ఫోన్ ఫీచర్లన్నీ మధ్యస్థంగా ఉన్నాయి. దీంట్లో 50MP, 8MP, 2MP ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్ ఉంది. వీటితో 4K, 1080p రెజల్యూషన్‌తో వీడియోలను తీయొచ్చని కంపెనీ చెబుతోంది. ప్రస్తుతం ఈ ఫోన్ చైనాలో మాత్రమే అందుబాటులో ఉంది. 240వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ కెపాసిటీ కలిగిన రియల్‌మీ GT నియో 5 ఫోన్ ధర సుమారు రూ.39వేలకు(470 డాలర్లు) అందుబాటులో ఉండవచ్చు.
పది నిమిషాల్లోనే పూర్తిగా ఛార్జ్ చేసుకునే వెసులుబాటు ఉన్నప్పటికీ ఇందులో కొన్ని సవాళ్లు ఉన్నాయి. 240వాట్ల కెపాసిటీని ఇచ్చే పవర్‌ఫుల్ అడాప్టర్ కావాల్సి ఉంటుంది. దీనికి బలమైన సీ కేబుల్‌ను రూపొందించాలి. అంత కెపాసిటీని తట్టుకునేలా అడాప్టర్, కేబుల్‌ను కూడా తీసుకురావాలి.
ఈ ఫోన్ బ్యాటరీకి వైర్‌లెస్ ఛార్జింగ్ సదుపాయం అందుబాటులో లేదు. వీటితో పాటు 144Hz రిఫ్రెషింగ్ రేట్, ఆక్టా కోర్ ప్రాసెసర్‌లు బ్యాటరీపై ఎలాంటి ప్రభావం చూపుతాయో తెలియాలంటే లాంచ్ అయ్యే వరకూ చూడాల్సిందే.!