కోకా కోలా మొబైల్ తయారీ రంగంలోకి దిగనుందా..? 

-

కోకా కోలా.. పరిచయం అక్కర్లేని బ్రాండ్‌ ఇది..ఈ పేరు వినగానే కూల్‌డ్రింక్‌ మాత్రమే గుర్తుకు వస్తుంది.. కానీ ఇకనుంచి మీరు కోకా కోలా పేరు వినగానే.. ఫోన్‌ కూడా వస్తుంది.. ఎందుకంటే..ఈ కంపెనీ ఇండియాలో బ్రాండెడ్ స్మార్ట్‌ఫోన్ విడుదల చేసే ఆలోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే కోకా కోలా మొబైల్ తయారీ రంగంలోకి దిగనుందా? లేకపోతే వేరే బ్రాండెడ్ మొబైల్‌ను ప్రజెంట్ చేస్తున్నారా? అన్నది ఇంకా క్లారిటీ రాలేదు..
టిప్‌స్టర్ ముకుల్ శర్మ షేర్ చేసిన ట్వీట్‌లో కోకాకోలా బ్రాండ్ స్మార్ట్‌ఫోన్ ఫొటోను డిస్‌ప్లే చేశారు. ఈ స్మార్ట్ ఫోన్ చూడటానికి రియల్‌మీ 10 4జీ తరహలో ఉంది. దీన్ని బట్టి రియల్‌మీ, కోకా కోలా భాగస్వామ్యం ఏర్పరచుకున్నట్లు కనిపిస్తోందని తెలుస్తోంది..లీకైన ఫొటోలో స్మార్ట్‌ఫోన్ లుక్ ఎలా ఉందో చూడవచ్చు. కోకా కోలా స్మార్ట్‌ఫోన్‌లో వెనుక వైపు ఎల్ఈడీ ఫ్లాష్‌తో కూడిన కెమెరా సెటప్ ఉంది.. ఫోన్ రౌండ్ అంచులను కలిగి ఉంది. వాల్యూమ్ బటన్లు కుడి వైపున ఇచ్చారు.. ఫోన్ వెనుక ప్యానెల్‌లో కోకా కోలా బ్రాండింగ్‌తో ఎరుపు రంగులో ఉంటుంది. ఈ స్మార్ట్‌ఫోన్ ఒకవేళ రియల్‌మీ 10 4జీ ప్రత్యేక ఎడిషన్ అయినట్లయితే, ఫోన్ 2400 x 1080 పిక్సెల్స్ ఉన్న పుల్ హెచ్‌డీ+ రిజల్యూషన్ ఉన్న డిస్‌ప్లే అందించనున్నారు. దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉండనుంది.

రియల్‌మీ 5జీ వర్షన్‌ స్పెసిఫికేషన్స్..

రియల్‌మీ 10లోనే 4జీతో పాటు 5జీ వెర్షన్ కూడా అందుబాటులో ఉంది.
ఇందులో 6.6 అంగుళాల పుల్ హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు.
దీని స్క్రీన్ రిజల్యూషన్ 1080 × 2400 పిక్సెల్స్ కాగా, స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 90 హెర్ట్జ్‌గా ఉంది.
ఆక్టాకోర్ మీడియాటెక్ డైమెన్సిటీ 700 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పని చేయనుంది.
8 జీబీ ఎల్పీడీడీఆర్4ఎక్స్ ర్యామ్, 256 జీబీ వరకు యూఎఫ్ఎస్ 2.2 ఇంటర్నల్ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి. స్టోరేజ్‌ను మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 1 టీబీ వరకు పెంచుకోవచ్చు.

ఇక కెమెరాల విషయానికి వస్తే…

ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉన్నాయి. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 50 మెగాపిక్సెల్ కాగా, దీంతోపాటు 2 మెగాపిక్సెల్ మాక్రో సెన్సార్, ఏఐ లెన్స్ కూడా అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 8 మెగాపిక్సెల్ సెన్సార్ ఉంది. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా, 33W ఫాస్ట్ చార్జింగ్‌ను కూడా సపోర్ట్ చేయనుంది.

Read more RELATED
Recommended to you

Latest news