OnePlus 9 5Gపై బంపర్‌ ఆఫర్.. రూ. 50వేల ఫోన్ రూ. 16 వేలకే..!

-

వన్‌ప్లస్‌కు నేడు మార్కెట్‌లో మంచి డిమాండ్‌ ఉంది. వన్‌ప్లస్‌ 9 5జీ స్మార్ట్‌ ఫోన్‌పై అమెజాన్‌లో భారీ ఆఫర్‌ ప్రకటించారు. కొత్త ఫోన్‌ తీసుకోవాలనుకునేవారు.. ఈ ఆఫర్‌తో వన్‌ప్లస్‌ తీసుకోవచ్చు. రూ.16 వేలకే ఫోన్‌ మీ సొంతం అవుతుంది. ఏంటి షాకింగ్‌గా ఉందా..? అసలు ఫోన్‌ కాస్ట్ రూ.50 వేలు మరి అంత తక్కువ ధరకు ఫోన్ ఎలా వస్తుందో మీరు చూడండి.!
వన్‌ప్లస్ 9 5జీ ధర..
ఈ ఫోన్ అసలు ధర రూ.49,999 కాగా… రూ.37,999కే కొనుగోలు చేయవచ్చు. ఇది 8 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్ మోడల్ ధర.
ఇక 12 జీబీ ర్యామ్ + 256 జీబీ స్టోరేజ్ వేరియంట్ ధర కూడా రూ.42,999కు తగ్గింది.
అయితే ఎక్స్‌చేంజ్ ద్వారా కొనుగోలు చేస్తే మీ స్మార్ట్ ఫోన్‌ను బట్టి అదనంగా మరో రూ.21,500 వరకు తగ్గింపు లభించనుందట… అంటే రూ.16,099కే ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
వన్ ప్లస్ 9 5జీ స్పెసిఫికేషన్లు..
ఆండ్రాయిడ్ 11 ఆధారిత ఆక్సిజన్ ఓఎస్ 11 ఆపరేటింగ్ సిస్టంపై వన్‌ప్లస్ 9 పనిచేయనుంది.
6.55 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ ఫ్లూయిడ్ అమోఎల్ఈడీ డిస్ ప్లేను ఇందులో అందించారు.
దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్‌గా ఉంది.
3డీ కార్నింగ్ గొరిల్లా గ్లాస్ ప్రొటెక్షన్ కూడా ఈ స్మార్ట్ ఫోన్‌లో వన్ ప్లస్ అందించింది.
ఆక్టాకోర్ క్వాల్ కాం స్నాప్ డ్రాగన్ 888 ప్రాసెసర్‌పై ఈ స్మార్ట్ ఫోన్ పనిచేయనుంది.
12 జీబీ వరకు ర్యామ్, 256 జీబీ వరకు స్టోరేజ్ ఇందులో అందించారు.
ఇన్ డిస్ ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్ ఫీచర్ ఇందులో ఉంది.
డాల్బీ అట్మాస్ సపోర్ట్‌తో ఉన్న స్పీకర్లు ఇందులో అందించారు.
 ఈ స్మార్ట్ ఫోన్ మందం 0.81 సెంటీమీటర్లుగానూ, బరువు 183 గ్రాములుగానూ ఉంది.

ఇక కెమెరాల విషయానికి వస్తే..

ఈ స్మార్ట్ ఫోన్‌లో వెనకవైపు మూడు కెమెరాలు ఇచ్చారు.. వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం.. 48 మెగాపిక్సెల్ కాగా.. సోనీ ఐఎంఎక్స్689 సెన్సార్‌ను వన్‌ప్లస్ అందించింది. ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ ఫీచర్ కూడా ఇందులో ఉంది. దీంతోపాటు 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్766 అల్ట్రా వైడ్ యాంగిల్ ఫ్రీఫాం లెన్స్, 2 మెగాపిక్సెల్ మోనోక్రోమ్ సెన్సార్ కూడా అందించారు. ఇక సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం ముందువైపు 16 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్471 కెమెరాను అందించారు.

బ్యాటరీ సమార్థ్యం…

ఈ స్మార్ట్ ఫోన్ బ్యాటరీ సామర్థ్యం 4500 ఎంఏహెచ్‌గా ఉంది. వార్ప్ చార్జ్ 65టీ ఫాస్ట్ చార్జింగ్‌ను వన్‌ప్లస్ 9 సపోర్ట్ చేయనుంది. 5జీ, 4జీ ఎల్టీఈ, వైఫై 6, బ్లూటూత్ 5.2, జీపీఎస్/ఏ-జీపీఎస్, ఎన్ఎఫ్‌సీ, యూఎస్‌బీ టైప్-సీ పోర్టు కూడా ఇందులో అందించారు.
– Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news