iQOO Neo 6 ఫోన్‌ పై అదిరిపోయే డిస్కైంట్.. iQOO 9 5Gపై కూడా..!

-

ఇండియన్‌ మార్కెట్‌లోకి iQOO Neo 6 సిరీస్‌ ఫోన్‌ ఎంట్రీ ఇచ్చింది. ఈ నెల 6 వరకు ఫోన్‌ పై భారీ డిస్కౌంట్‌ అందిచారు. ఈ ఫోన్‌కు గట్టి పోటీ OnePlus Nord 2T 5G . దీని ధర కూడా 29,999కి చేరింది. ప్రస్తుతం మార్కెట్‌లో ఉన్న iQOO సిరీస్‌ ఫోన్ల వివరాలు, వాటిపై ఉన్న డిస్కౌంట్‌లు ఇలా ఉన్నాయి..!
మరో స్మార్ట్ ఫోన్ మేకర్ OnePlus Nord 2T 5G లాంచింగ్ తర్వాత.. iQOO Neo 6 భారత మార్కెట్లో భారీ డిస్కౌంట్ ఆఫర్ అందిస్తోంది. iQOO Neo 6 అమెజాన్‌లో జూలై 1 నుంచి జూలై 4 వరకు డిస్కౌంట్ ధరతో అందుబాటులో ఉంటుంది. ఈ డిస్కౌంట్ ధరతో మరో పోటీదారు Nord 2T ధర రూ. 26,999కి తక్కువ ధరకు చేరింది.

iQOO Neo 6 ధర..ఆఫర్లు..

చైనీస్ స్మార్ట్‌ఫోన్ తయారీదారు iQOO 9 సిరీస్‌తో పాటు iQOO Z సిరీస్‌ను అందిస్తోంది. లిమిటెడ్ ఆఫర్ అందించే iQOO Neo 6 ధర 8GB RAM + 128GB స్టోరేజ్ మోడల్‌తో రూ.26,999కి వస్తుంది.
ఈ-కామర్స్ ప్లాట్‌ఫారమ్ ఐసిఐసిఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌ని ఉపయోగించి షాపింగ్ చేసే యూజర్లకు రూ. 3,000 డిస్కౌంట్ ఆఫర్ అందుబాటులో ఉంది.
ప్లాట్‌ఫారమ్ మార్పిడిలో రూ. 12,150 తగ్గింపును కూడా అందిస్తోంది.
12GB RAM + 256GB స్టోరేజ్‌తో వచ్చే టాప్-ఎండ్ మోడల్‌పై కూడా ఆఫర్ అందుబాటులో ఉంది.

iQOO 9 5Gపై కూడా భారీ డిస్కౌంట్‌..

iQOO 9 5G డిస్కౌంట్ ధరతో అందుబాటులో ఉంది. అమెజాన్ స్మార్ట్‌ఫోన్‌పై రూ.4,000 డిస్కౌంట్ అందిస్తోంది. దీని ధర రూ.38,999కి తగ్గింది. వాస్తవానికి, రూ. 40,000 ధర ట్యాగ్ కింద అత్యుత్తమ ఫోన్‌లలో ఈ ఫోన్‌ నిలిచింది. ఈ ఆఫర్ ICICI క్రెడిట్ కార్డ్ యూజర్లకు మాత్రమే వర్తిస్తుంది. 8GB RAM+128GB స్టోరేజ్, 12GB RAM + 256GB స్టోరేజ్‌తో రెండు వేరియంట్‌లపై డిస్కౌంట్‌తో రానుంది.

Read more RELATED
Recommended to you

Latest news