ఈరోజుల్లో స్మార్ట్ ఫోన్ వాడకం ఈరోజుల్లో ఎక్కువైపోయింది. కానీ ఏ ఫోన్ అయినా..సంవత్సరం వాడిన తర్వాత ముందు ఉన్నంత ఫాస్ట్ గా ఉండటం లేదు. సో కాల్డ్ ఫోన్లు కూడా 12- 19 నెలల తర్వాత స్లో అయిపోతూ ఉంటుంది. మనం కూడా ఫోన్ రిపేర్ చేయించటం కంటే..అది అమ్మేసి కొత్తది తీసుకోవడానికే చూస్తుంటాం. చాలామంది EMIలో ఫోన్ కొంటుంటారు..EMIలు అన్ని అయిపోయి హమ్మయ్యా అనుకునేలోపే..ఫోన్ మందగించటం స్టాట్ అవుతుంది.. అయితే కొన్ని సెట్టింగ్స్ మారిస్తే మన ఫోన్ ఫాస్ట్ గా పనిచేస్తుంది. తద్వారా ఇంకొన్ని రోజులు ఎక్కువగా వాడొచ్చు. మరి ఆ సెట్టింగ్స్ ఎలాగో చూద్దాం.
Live Wallpapers:
మీ స్మార్ట్‌ఫోన్‌లో లైవ్ వాల్‌పేపర్స్ వాడుతున్నట్టైతే వెంటనే మార్చేయండి. ఎందుకంటే.. లైవ్ వాల్‌పేపర్స్ వల్ల సీపీయూ ఎప్పుడూ రన్నింగ్‌లోనే ఉంటుంది. బ్యాటరీ కూడా త్వరగా తగ్గిపోతుంది. ఛార్జింగ్ ఫాస్ట్ గా అయిపోతుంది. మీరు హోమ్ స్క్రీన్ ఆన్ చేయగానే యాప్స్‌తో పాటు లైవ్ వాల్ పేపర్స్ కూడా సీపీయూ, బ్యాటరీని ఉపయోగించుకుంటాయి. అందుకే స్టాటిక్ వాల్‌పేపర్ ఉపయోగించండి.
Toggle Animations:
మీ స్మార్ట్‌ఫోన్ ఆపరేట్ చేస్తున్నప్పుడు యానిమేషన్స్ కనిపిస్తూ ఉంటాయి. యానిమేషన్ స్కేల్ మారిస్తే మీ స్మార్ట్‌ఫోన్ ఆపరేటింగ్ స్మూత్ అవుతుంది. Settings > Developer Options > Window Animation Scale > Animation Scale 10x క్లిక్ చేసి యానిమేషన్ స్కేల్ మార్చుకోవచ్చు. మీకు సౌకర్యంగా ఉండే స్కేల్ ఎంచుకోండి.
Disable Apps:
స్మార్ట్‌ఫోన్‌లో అనవసరమైన యాప్స్ చాలానే ఉంటాయి. ఇన్‌బిల్ట్ యాప్స్‌ని మనం ఎలాగో డిలిట్ చేయడం సాధ్యం కాదు. మీరు ఆ యాప్స్ ఉపయోగించనట్టైతే వాటిని డిసేబుల్ చేసుకోవచ్చు. యాప్స్ డిసేబుల్ చేస్తే ఆ యాప్ యాక్టీవ్‌లో ఉండవు. మీరు కావాలనుకున్నప్పుడు ఆ యాప్ ఉపయోగించుకోవచ్చు.
Android Update:
మీ స్మార్ట్‌ఫోన్‌లో ఆండ్రాయిడ్ వర్షన్ అప్‌డేట్ అయిందో లేదో చెక్ చేయండి.. అప్‌డేట్ చేయాల్సి ఉంటే వెంటనే ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్ చేయండి. ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్ చేస్తే స్మార్ట్‌ఫోన్ యూజర్ ఇంటర్‌ఫేస్ మారడం మాత్రమే కాదు… ఫోన్ పనితీరు కూడా వేగంగా మారుతుంది. పాత వర్షన్ ఆపరేటింగ్ సిస్టమ్ ఉపయోగించొద్దు. ఆపరేటింగ్ సిస్టమ్ అప్‌డేట్ చేయడానికి Settings> System> System updates> క్లిక్ చేయాలి. ఇందుకు కాస్త నెట్ ఎక్కువ కావాల్సి ఉంటుంది కాబట్టి నెట్ స్పీడ్ ఎక్కువ ఉన్నప్పుడు చేయండి.
Widgets:
స్మార్ట్‌ఫోన్ స్క్రీన్ పైన విడ్జెట్స్ చూడటానికి బాగానే ఉంటాయి. కానీ అవి ఎప్పుడూ యాక్టివేట్‌గా ఉంటాయి కాబట్టి… సీపీయూ, బ్యాటరీ పనితీరుపై ప్రభావం ఉంటుంది. మీకు ఎక్కువగా ఉపయోగపడే విడ్జెట్స్ మాత్రమే ఉపయోగించండి. మిగతావాటిని తొలగించేయండి.
ఇలా కొన్ని మార్పులు చేస్తే..ఫోన్ ఫాస్ట్ అవుతుంది. మీ ఫోన్ తో స్లో ప్రాబ్లమ్ ఉంటే..వెంటనే వీటిని చేసేయండి.