ఇండియాలో లాంచ్‌ అయిన Infinix Smart 6 HD స్మార్ట్‌ ఫోన్‌..

-

ఇండియాలో Infinix Smart 6 HD స్మార్ట్‌ ఫోన్‌ లాంచ్‌ అయింది. ఇది ఒక బడ్జెట్‌ స్మార్ట్‌ ఫోన్..మూడ వేరియంట్లలో లాంచ్‌ అయిన ఈ ఫోన్‌ స్పెసిఫికేషన్లు ఇలా ఉన్నాయి..
ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 6 హెచ్‌డీ ధర..
ఈ స్మార్ట్ ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.6,799 ధరకే లాంచ్ అయింది.
ఆక్వా స్కై, ఆరిజిన్ బ్లూ, ఫోర్స్ బ్లాక్ రంగుల్లో ఈ ఫోన్ కొనుగోలు చేయవచ్చు.
ఇందులో 2 జీబీ ర్యామ్ + 64 జీబీ స్టోరేజ్ వేరియంట్ మాత్రమే అందుబాటులో ఉంది.
ఇన్‌ఫీనిక్స్ స్మార్ట్ 6 హెచ్‌డీ స్పెసిఫికేషన్లు..
ఈ స్మార్ట్ ఫోన్‌లో 6.6 అంగుళాల హెచ్‌డీ+ ఐపీఎస్ ఎల్సీడీ డిస్‌ప్లేను అందించారు.
దీని స్క్రీన్ రిజల్యూషన్ 1600 x 720 పిక్సెల్స్‌గా ఉంది.
దీని యాస్పెక్ట్ రేషియో 20:9 కాగా, పీక్ బ్రైట్‌నెస్ 500 నిట్స్‌గా ఉంది.
మీడియాటెక్ హీలియో ఏ22 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
2 జీబీ ర్యామ్, 64 జీబీ స్టోరేజ్ ఇందులో ఉన్నాయి.
దీన్ని మైక్రో ఎస్‌డీ కార్డు ద్వారా 512 జీబీ వరకు పెంచుకోవచ్చు.
ఫింగర్ ప్రింట్ సెన్సార్‌ను ఫోన్ పక్కభాగంలో అందించారు.
ఫేస్ అన్‌లాక్ సపోర్ట్ అందుబాటులో లేదు.
ఆండ్రాయిడ్ 11 గో ఎడిషన్ ఆధారిత ఎక్స్ఓఎస్ 7.6 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఇందులో 5000 ఎంఏహెచ్ బ్యాటరీని అందించారు.
హెచ్‌డీ+ డిస్‌ప్లే, మీడియాటెక్ హీలియో ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
ఇక కెమెరాల విషయానికి వస్తే… ఫోన్ వెనకవైపు 8 మెగాపిక్సెల్ కెమెరా, ముందువైపు 5 మెగాపిక్సెల్ సెన్సార్లు ఉన్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్‌గా ఉంది. 10W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది. ఒక్కసారి చార్జింగ్ చేస్తే 31 గంటల పాటు కాల్ మాట్లాడవచ్చు.
కొన్ని రోజుల క్రితం ఇన్‌ఫీనిక్స్ హాట్ 12 ప్రోను కంపెనీ లాంచ్ చేసింది. ఇటీవలే కొత్త స్మార్ట్ టీవీ కూడా లాంచ్ చేసింది. ఇన్‌ఫీనిక్స్ 32వై1 పేరుతో మార్కెట్లోకి వచ్చిన ఈ టీవీ ఆండ్రాయిడ్ 11 ఆపరేటింగ్ సిస్టంపై పనిచేయనుంది. కష్టమర్స్‌ను యట్రాక్ట్‌ చేయడానికి కంపెనీ తక్కువ బడ్జెట్‌లోనే తన ప్రొడెక్ట్‌ అందిస్తోంది.

Read more RELATED
Recommended to you

Latest news