iQoo U5e.. తక్కువ బడ్జెట్‌లో బెస్ట్‌ 5G స్మార్ట్‌ ఫోన్.. ఫీచర్స్‌ ఇవే..!

-

IQoo నుంచి ఈ మధ్యనే 10సిరీస్‌లో రెండు ఫోన్లను లాంచ్‌కు రెడీ చేసింది. ఇప్పుడు తాజాగా.. IQoo U5e అనే స్మార్ట్‌ఫోన్‌ను విడుదల చేసింది. వివో సబ్‌ బ్రాండ్‌ అయిన ఐక్యూ.. ఈ ఫోన్‌ను వివో చైనా ఆన్‌లైన్‌ స్టోర్‌లో సేల్‌ చేస్తుంది. ఈ ఫోన్ ఫీచర్స్‌, స్పెసిఫికేషన్లు ఇలా ఉన్నాయి.

iQOO U5e ధర..

ఈ స్మార్ట్‌ఫోన్‌ రెండు కాన్ఫిగరేషన్లలో లభిస్తుంది. బేసిక్ వేరియంట్ అయిన 4GB RAM + 128GB స్టోరేజ్ మోడల్ ధర CNY 1,399 (దాదాపు రూ. 16,000) ఉంది
6GB RAM + 128GB మోడల్ ధర CNY 1,499 (దాదాపు రూ. 18,000)గా ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ డార్క్ బ్లాక్, సిల్వర్ వైట్ అనే రెండు కలర్ ఆప్షన్‌లలో అందుబాటులో ఉంది.

iQOO U5e స్మార్ట్‌ఫోన్‌ ఫీచర్లు..

ఈ స్మార్ట్‌ ఫోన్‌కు.. 60Hz రిఫ్రెష్ రేట్ కలిగిన 6.51-అంగుళాల HD+ IPS LCD స్క్రీన్ అమర్చారు.
ఆక్టా-కోర్ డైమెన్సిటీ 700 చిప్‌సెట్‌ కలిగి ఉంది.
4GB/6 GB RAM, 128 GB ఇంటర్నల్ స్టోరేజ్‌తో ఇది పనిచేస్తుంది.
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టమ్‌పై ఇది పనిచేస్తుంది.
18W ఫాస్ట్‌ ఛార్జర్‌తో 5000mAh బ్యాటరీ సామార్థ్యం కలిగి ఉంది.
ఈ హ్యాండ్‌సెట్ 193g బరువును కలిగి ఉంది.
ఇందులో 5G, సైడ్-మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్ , ఫేషియల్ రికగ్నిషన్ టెక్నాలజీ, USB టైప్-C పోర్ట్, 3.5mm హెడ్‌ఫోన్ జాక్‌, డ్యూయల్-బ్యాండ్ Wi-Fi , బ్లూటూత్ v5.1 వంటి కనెక్టివిటీ ఫీచర్లు ఉన్నాయి.

కెమెరా క్వాలిటీ..

ఫోన్‌కు వెనకవైపు 13 మెగాపిక్సెల్ కెమెరా + 2MP సెన్సార్ ఉంది. సెల్ఫీలు వీడియో కాల్స్‌ కోసం..ముందువైపు 8 MP సెల్ఫీ షూటర్ ఉంది.
-Triveni Buskarowthu

Read more RELATED
Recommended to you

Latest news