ఇండియాలో రిలీజ్‌ అయిన Lava Blaze NXT బడ్జెట్‌ ఫోన్..

-

లావా నుంచి కొంత ఫోన్‌ లాంచ్‌ అయింది. లావా బ్లేజ్ NXT (Lava Blaze NXT) అనే మరో కొత్త స్మార్ట్‌ఫోన్‌ను కంపెనీ రిలీజ్ చేసింది. ప్రస్తుతానికి ఇది 4GB + 64GB సింగిల్ కాన్ఫిగరేషన్‌లోనే లభిస్తుంది. మీడియాటెక్ హీలియో G37 SoC చిప్‌సెట్‌తో పనిచేస్తుంది. కంపెనీ ఈ కొత్త మోడల్‌ను ఇండియాలో లాంచ్ చేసింది కానీ దీని సేల్స్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతాయనే విషయాన్ని ఇంకా అధికారికంగా వెల్లడించలేదు. లావా బ్లేజ్ NXT డివైజ్‌ అమెజాన్ లిస్టింగ్‌లో కనిపించింది. దీన్ని బట్టి చూస్తే త్వరలో అమెజాన్‌లో దీని సేల్స్ ప్రారంభం కానున్నట్లు తెలుస్తోంది. ఫోన్‌కు సంబంధించిన పూర్తి వివరాలు ఇలా ఉన్నాయి.

ధర ఎంత?

లావా బ్లేజ్ NXT ఫోన్‌ ధర రూ. 9,299గా ఉంది.
ఈ ఫోన్ బ్లూ, రెడ్ వంటి రెండు కలర్ ఆప్షన్లలో వస్తుంది.

ఫీచర్లు, ప్రత్యేకతలు

లావా బ్లేజ్ NXT ఫోన్ 60Hz రిఫ్రెష్ రేట్‌తో 6.5 అంగుళాల HD+ IPS డిస్‌ప్లేతో వస్తుంది.
ఈ ఫోన్ మీడియాటెక్ హీలియో G37 చిప్‌సెట్‌తో పనిచేస్తుంది.
3.5mm హెడ్‌ఫోన్ జాక్‌తో వచ్చే ఈ ఫోన్ ఆండ్రాయిడ్ 12 అవుట్ ఆఫ్ బాక్స్‌ ఆపరేటింగ్ సిస్టమ్‌తో రన్ అవుతుంది.
బయోమెట్రిక్స్ కోసం రియర్ మౌంటెడ్ ఫింగర్ ప్రింట్ స్కానర్‌ను లావా అందించింది.
ఈ డివైజ్‌లో 5,000mAh సామర్థ్యం ఉన్న బ్యాటరీ ఉంటుంది.
దీన్ని టైప్-సి పోర్ట్‌ సాయంతో ఛార్జ్ చేయవచ్చు. ఇది కేవలం 4GB RAM, 64GB ఆన్‌బోర్డ్ స్టోరేజ్‌తో మాత్రమే లభిస్తుంది.
వర్చువల్ ర్యామ్‌ ఫీచర్‌తో ఫోన్ ర్యామ్‌ను 3GB వరకు విస్తరించుకోవచ్చు.

కెమెరా స్పెసిఫికేషన్లు

లావా బ్లేజ్ NXT ఫోన్ ట్రిపుల్ రియర్ కెమెరా సెటప్‌తో వస్తుంది. ఇందులో 13 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరాతో పాటు రెండు సెకండరీ సెన్సార్లు ఉన్నాయి.. ఈ కెమెరా సెటప్ 30 fps వద్ద 1080P ఫుల్ HD వీడియోలను రికార్డ్ చేయగలదు. సెల్ఫీలు, వీడియో కాల్స్‌ కోసం.. ఫోన్ ముందు భాగంలో 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరాను కూడా కంపెనీ అందించింది.

Read more RELATED
Recommended to you

Latest news