ఈరోజే లాంచ్‌ కానున్న మోటో జీ72.. ముందే లీకైన స్పెసిఫికేషన్స్..

-

మోటో నుంచి కొత్త ఫోన్‌ లాంచ్‌కు రెడీ అయింది. అదే మోటో జీ 72 స్మార్ట్‌ ఫోన్..ఫోన్‌కు విడుదలకు ముందే కొంత సమాచారం లీక్ అయింది. అక్టోబర్‌ 3న ఫోన్‌ ఇండియాలో లాంచ్‌ కానుంది. లీకులను బట్టి వివరాలు ఇలా ఉన్నాయి..

మోటో జీ72 స్పెసిఫికేషన్లు (అంచనా)..

ఇందులో పీఓఎల్ఈడీ డిస్‌ప్లేను అందించనున్నారు. సన్నటి బెజెల్స్‌తో పంచ్ హోల్ తరహా డిజైన్‌ను ఇందులో అందించారు.
దీని స్క్రీన్ రిఫ్రెష్ రేట్ 120 హెర్ట్జ్ కాగా, ఫుల్ హెచ్‌డీ+ రిజల్యూషన్‌తో ఈ డిస్‌ప్లే ఉండనుంది.
దీని టచ్ శాంప్లింగ్ రేట్ 576 హెర్ట్జ్ గా ఉంది.
హెచ్‌డీఆర్10 ను ఇది సపోర్ట్ చేయనుంది.
ఫోన్ వెనకవైపు మూడు కెమెరాలు ఉండనున్నాయి.
వీటిలో ప్రధాన కెమెరా సామర్థ్యం 108 మెగాపిక్సెల్ కాగా దీంతోపాటు అల్ట్రా వైడ్ యాంగిల్ లెన్స్, మాక్రో లెన్స్ కూడా ఉండనున్నాయి.
ఆండ్రాయిడ్ 12 ఆపరేటింగ్ సిస్టంపై ఈ ఫోన్ పనిచేయనుంది.
అన్ని మోటొరోలా ఫోన్ల తరహాలోనే ఇది కూడా స్టాక్ ఆండ్రాయిడ్ ఎక్స్‌పీరియన్స్‌ను అందించనుంది.

మీడియాటెక్ హీలియో జీ99 ప్రాసెసర్‌పై ఈ ఫోన్ పనిచేయనుంది.
మీడియాటెక్ హీలియో జీ96 ప్రాసెసర్ కంటే ఇది వేగంగా పని చేయనుంది.
6 జీబీ ర్యామ్, 128 జీబీ స్టోరేజ్ ఇందులో ఉండనున్నాయి. దీని బ్యాటరీ సామర్థ్యం 5000 ఎంఏహెచ్ కాగా 33W ఫాస్ట్ చార్జింగ్‌ను ఈ ఫోన్ సపోర్ట్ చేయనుంది.
డాల్బీ అట్మాస్ సపోర్ట్ కూడా ఇందులో ఉంది.
సెక్యూరిటీ కోసం ఇన్ డిస్‌ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్, ఫేస్ అన్‌లాక్ ఫీచర్‌లను అందించారు.
ఐపీ52 వాటర్, డస్ట్ రెసిస్టెన్స్ రేటింగ్‌లు కూడా ఇందులో ఉన్నాయి.

ఇది ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉండనుంది. ఈ ఫోన్ మిడ్ రేంజ్ విభాగంలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. మిటియోరైట్ గ్రే, పోలార్ బ్లూ రంగుల్లో ఈ ఫోన్ మార్కెట్లో ఎంట్రీ ఇవ్వనుంది. మైక్రోసైట్‌ను ఫ్లిప్‌కార్ట్ క్రియేట్ చేసింది. దీని డిజైన్, హైలెట్స్‌ను ఈ మైక్రో సైట్‌లో చూడవచ్చు

Read more RELATED
Recommended to you

Latest news