లాంచ్‌కు రెడీ అయిన Samsung Galaxy F13.. లీకైన ఫీచర్స్‌ ఇవే..!

-

శాంసంగ్‌ గెలాక్సీ Fసిరీస్‌లో భాగంగా.. F13 స్మార్ట్‌ ఫోన్‌ను లాంచ్‌కు రెడీ చేసింది. ఈరోజు శాంసంగ్‌ గెలాక్సీ F13 స్మార్ట్‌ ఫోన్‌ లాంచ్‌ కానుంది. ఇది ఒక బడ్జెట్‌ స్మార్ట్‌ ఫోన్. శాంసంగ్‌ అభిమానులకు ఈ ఫోన్‌ కచ్చితంగా నచ్చుతుందనే చెప్పాలి. లీకైన సమాచారం ప్రకారం ఈ ఫోన్‌ ఫీచర్స్‌, తదితర వివరాలు ఇలా ఉన్నాయి.
స్పెసిఫికేషన్స్ (అంచనా) :
శాంసంగ్ గెలాక్సీ F13 6.6-అంగుళాల సైజు Full HD+ డిస్‌ప్లేతో రానుంది.
స్క్రీన్‌లో నాచ్ ఉంటుంది. సాధారణం కంటే చిన్నదిగా ఉంటుంది.
ఇక డివైజ్‌పై బెజెల్‌లు సన్నగా ఉంటాయి. శాంసంగ్ కూడా గెలాక్సీ F13 బాక్స్‌లో 15W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్టుతో రానుంది. 6000mAh బ్యాటరీతో సపోర్టు చేస్తుందని ధృవీకరించింది.
దక్షిణ కొరియా స్మార్ట్‌ఫోన్ తయారీదారు Samsung Galaxy F13 8GB RAM వరకు వస్తుందని, RAM ఫీచర్ కూడా ఉందని ధృవీకరించింది.
డివైజ్ సున్నితంగా లాగ్-ఫ్రీ పర్ఫార్మెన్స్ అందించవచ్చు.
శాంసంగ్ గెలాక్సీ F13 సిరీస్‌లో ఆటో డేటా స్విచింగ్ ఫీచర్‌ను అందించే మొదటి స్మార్ట్‌ఫోన్ కానుంది.
SIM ప్యాచీగా పనిచేస్తుంటే.. నెట్‌వర్క్‌తో సంబంధం లేకుండా డేటా ఆటోమేటిక్‌గా సెకండరీ SIMకి స్విప్ట్ అవుతుంది.
ఫోన్ పింక్, గ్రీన్, బ్లూ వంటి మూడు కలర్ ఆప్షన్లలో రానుంది. అయితే కలర్ ఆప్షన్ల అధికారిక పేర్లు ఇంకా వెల్లడించలేదు.
Galaxy F13 Exynos 850 ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. సెల్ఫీలు, వీడియో కాల్‌ కోసం 50-MP ప్రైమరీ రియర్ కెమెరా, 8-MP ఫ్రంట్ షూటర్‌ను కలిగి ఉంటుంది.
Android 12 ఆపరేటింగ్ సిస్టమ్ ఆధారంగా బాక్స్ వెలుపల One UI 4.1 వెర్షన్‌తో రన్ అవుతుంది.
ఫోన్ సైడ్-మౌంటెడ్ ఫింగర్‌ప్రింట్ సెన్సార్‌ కూడా ఉంది. పవర్ బటన్‌గా కూడా మారుతుంది.
శాంసంగ్ గెలాక్సీ F13 ధరను వెల్లడించలేదు. లీక్‌లు ఫోన్ ధర ఎక్కడో రూ. 12,000 ఉంటుందని అంచనా.
శాంసంగ్ అధికారిక వెబ్ సైట్, యూట్యూబ్ ఛానెల్ లో మధ్యాహ్నం 12గంటలకు ప్రారంభం కానుంది. రాబోయే స్మార్ట్‌ఫోన్ ఫ్లిప్‌కార్ట్‌లో అందుబాటులో ఉంటుందని కంపెనీ ధృవీకరించింది. అయితే లాంచ్ తేదీని సౌత్ కొరియన్ దిగ్గజం ఇంకా వెల్లడించలేదు.

Read more RELATED
Recommended to you

Latest news