త్వరలోనే లాంచ్‌ కానున్న Vivo V25 Pro..ముందే లీకైన ఫీచర్స్‌…!

ప్రముఖ స్మార్ట్‌ ఫోన్‌ దిగ్గజం వీవో నుంచి కొత్త ఫోన్‌ వచ్చింది. అదే Vivo v25 Pro సిరిస్‌ రానున్నట్లు తెలుస్తోంది. అయితే ఖచ్చితమైన లాంచ్ తేదీను కంపెనీ ఇంకా ప్రకటించలేదు. లాంచ్‌కు ముందే ఫోన్‌కు సంబంధించిన ఫీచర్స్‌ కొన్ని లీక్‌ అయ్యాయి. ఆ వివరాలు ఇలా ఉన్నాయి…
Vivo V25 Pro ధర :
Vivo V25 స్మార్ట్ ఫోన్ వేరియంట్.. 8GB RAM + 128GB స్టోరేజ్, 12GB RAM + 256GB స్టోరేజ్ అనే రెండు స్టోరేజ్ వేరియంట్‌లతో రానుంది. ఈ బేస్ వేరియంట్ ధర రూ. 40వేల లోపు ఉంటుందని అంచనా… Vivo V23 Pro మాదిరిగానే రూ. 38,990 ప్రారంభ ధరతో వస్తుంది.Vivo V25 సిరీస్‌ను లాంచ్ చేసిన తర్వాత, ప్రస్తుత జనరేషన్ Vivo V23, V23 Pro మోడల్స్ త్వరలో భారత మార్కెట్లో డిస్కౌంట్ ధరకే అందుబాటులోకి రానున్నట్లు సమాచారం.
Vivo V25 Pro స్పెసిఫికేషన్స్‌ (అంచనా)..
 Vivo V25 ప్రో వెనుక ప్యానెల్ ఫ్లోరైట్ AG గ్లాస్‌తో కలర్ మార్చే టెక్నాలజీతో రానుందని లీక్ రిపోర్టు పేర్కొంది.
 Full-HD+ రిజల్యూషన్‌తో 3D కర్వ్డ్ AMOLED డిస్‌ప్లే, 120Hz రిఫ్రెష్ రేట్‌తో వచ్చింది.
Vivo V25 Pro 66W ఫాస్ట్ ఛార్జింగ్‌ సపోర్టు కూడా అందిస్తుంది.
OnePlus Nord 2T 5Gకి సపోర్టు చేసే MediaTek Dimensity 1300 చిప్‌సెట్ తో రానుంది.
ఈ ఫోన్‌కు సంబంధించి వీడియోను విరాట్ కోహ్లీ రిలీజ్ చేశాడు.
బ్లూ కలర్ ఆప్షన్, వెనుక కెమెరాల బిగ్ కటౌట్ డిజైన్ ఉన్నట్టు కనిపిస్తోంది.
సెకండరీ కెమెరాకు ఎలక్ట్రానిక్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (EIS) సపోర్టు ఉండే అవకాశం ఉంది.
Vivo 25 Pro ట్రిపుల్ రియర్ కెమెరా సిస్టమ్‌తో రానుంది. ఇందులో 64-MP ప్రైమరీ సెన్సార్ ఉంటుంది. అద్భుతమైన ఇమేజ్‌లు, క్వాలిటీ వీడియోల కోసం ఆప్టికల్ ఇమేజ్ స్టెబిలైజేషన్ (OIS)తో రానుంది. ముందు ప్యానెల్‌లో 32-MP IAF సెల్ఫీ కెమెరా ఉంటుంది.